Veda Krishnamurthy : భారత క్రికెటర్ వేద కృష్ణమూర్తి (Veda Krishnamurthy) రిటైర్మెంట్ ప్రకటించింది. సుదీర్ఘ కాలం జట్టుకు మిడిలార్డర్ బ్యాటర్‌గా సేవలందించిన ఆమె అన్ని ఫార్మాట్లకు వీడ్కోలు పలికింది. ఐదేళ్లుగా జట్టులో చోటు దక్కించుకోలేకపోయిన వేద.. హృదయ పూర్వకంగానే ఆటకు అల్విదా చెబుతున్నాని సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది. విధ్వంసక బ్యాటర్‌గా, చురుకైన ఫీల్డర్‌గా ప్రేక్షకులను అలరించిన వేద.. చిన్న పట్టణం నుంచి వచ్చినప్పటికీ తన కలల్ని సాకారం చేసుకుంది.
‘కర్నాటకలోని కడూర్ అనే చిన్న పట్టణం నుంచి వచ్చిన అమ్మాయిని.. పెద్ద కలలను కన్నాను. చిన్నప్పుడు నాకు తెలియకుండానే బ్యాట్ పట్టుకున్నాను. అది నన్ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుందని ఏమాత్రం ఊహించలేదు. అమ్మ వత్సల ప్రోత్సాహంతో అబ్బాయిల ఆటైన క్రికెట్‌ను ఎంచుకున్న నేను ఆటను ఎంత ప్రేమించాను. చిన్న చిన్న వీధుల్లో పెరిగిన నన్ను పెద్ద పెద్ద స్టేడియాల్లోకి తీసుకెళ్లింది క్రికెట్. ఆశలు లేని స్థితిలో ఉన్న నన్ను గర్వంగా టీమిండియా జెర్సీ ధరించేలా చేసింది క్రికెట్టే. కెరీర్ ఒక్కటే కాదు ఈ ఆట నాకు చాలా ఇచ్చింది.
From a small-town girl with big dreams to wearing the India jersey with pride.
Grateful for everything cricket gave me the lessons, the people, the memories.
It’s time to say goodbye to playing, but not to the game.
Always for India. Always for the team. 🇮🇳 pic.twitter.com/okRdjYuW2R— Veda Krishnamurthy (@vedakmurthy08) July 25, 2025
నేను ఎంటో.. నా సత్తా ఏంటో నాకు తెలియజేసింది. కష్ట సమయాల్ల ఎలా పోరాడాలో నేర్పించింది. పడిలేచిన కెరటంలా సాగడం అలవాటు చేసింది. ఈరోజు మనఃస్ఫూర్తిగా క్రికెట్‌కు ముగింపు పలుకుతున్నాను’ అని తెలిపింది. ఈ సందర్భంగా తనకు అన్నివిధాల అండగా నిలిచిన అమ్మానాన్న, బీసీసీఐ, సహచరులు, కుటుంబ సభ్యులకు ఆమె కృతజ్ఞతలు చెప్పింది.
దూకుడే మంత్రగా చెలరేగే వేద తారా జువ్వలా 2011లో జట్టులోకి దూసుకొచ్చింది. దాదాపు తొమ్మిదేళ్లు దేశానికి ప్రాతినిధ్యం వహించిన ఆమె 48 వన్డేలు, 76 టీ20లు ఆడింది. చివరిసారిగా ఆస్ట్రేలియా వేదికగా 2020లో జరిగిన పొట్టి ప్రపంచకప్‌లో ఆడింది. వన్డేల్లో మాత్రం అంతకు రెండేళ్ల ముందే అంటే 2018లోనే ఆమె ప్రస్థానం ముగిసింది. ఈ ఫార్మాట్లో 829 రన్స్ చేసిన వేద.. టీ20ల్లో 875 రన్స్ సాధించింది. వేద 2017లో టీ20 వరల్డ్ కప్ ఫైనల్ ఆడిన భారత జట్టులో సభ్యురాలు కూడా. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో కర్నాటక, రైల్వే జట్లకు కెప్టెన్‌గానూ వ్యవహరించింది.