Abhishek Nair | టీమిండియా మాజీ కోచ్‌నే నమ్ముకున్న వారియర్స్.. టైటిల్ కల నెరవేరుస్తాడా..?
Abhishek Nair : భారత పురుషుల జట్టు మాజీ సహాయక కోచ్ అభిషేక్ నాయర్ (Abhishek Nair) మళ్లీ బిజీ అయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మూడో టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించిన నాయర్.. ఈసారి అమ్మాయిలకు శిక్షణ ఇవ్వనున్నాడు.
Abhishek Nair : భారత పురుషుల జట్టు మాజీ సహాయక కోచ్ అభిషేక్ నాయర్ (Abhishek Nair) మళ్లీ బిజీ అయ్యాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ మూడో టైటిల్ విజయంలో కీలక పాత్ర పోషించిన నాయర్.. ఈసారి అమ్మాయిలకు శిక్షణ ఇవ్వనున్నాడు. మహిళల ప్రీమియర్ లీగ్ (WPL) ఫ్రాంచైజీ యూపీ వారియర్స్ (UP Warriorz) జట్టుకు హెడ్‌కోచ్‌గా నాయర్ నియమితులయ్యాడు. ఆ జట్టుకు మూడు సీజన్లు కోచింగ్ ఇచ్చిన జాన్ లెవిస్ (John Lewis) స్థానంలో నాయర్‌ను తీసుకున్నట్టు శుక్రవారం యూపీ యాజమాన్యం ఎక్స్ వేదికగా వెల్లడించింది.
ఐపీఎల్లో కోల్‌కతాకు ఆపై భారత జట్టుకు అసిస్టెంట్ కోచ్‌గా సేవలందించిన నాయర్ తమ జట్టు టైటిల్ కలను సాకారం చేస్తాడని యూపీ యాజమాన్యం నమ్ముతోంది. ‘యూపీ వారియర్స్‌తో రెండేళ్ల క్రితం పని చేశాను. బెంగళూరు ఆ జట్లు ప్లేయర్లకు మెలకువలు చెప్పాను. కానీ, ఈసారి హెడ్‌కోచ్‌గా పెద్ద బాధ్యత అప్పగించారు. మహిళల క్రికెట్ అభివృద్ధికి డబ్ల్యూపీఎల్ చక్కని వేదిక. నాలుగో సీజన్లో యూపీ స్క్వాడ్ ప్రతిభావంతులతో నిండేలా చూస్తాను.
🚨 JUST IN: Abhishek Nayar has been named the new head coach of UP Warriorz ahead of #WPL2026 #wpl #abhisheknayar #upwarriorz pic.twitter.com/bWdnWum6Hk
— Cricbuzz (@cricbuzz) July 25, 2025
ఇప్పటికే ఆ జట్టు పటిష్టంగానే ఉంది’ అని నాయర్ వెల్లడించాడు. నిరుడు గౌతం గంభీర్ బృందంలో ఒకడిగా టీమిండియాకు అసిస్టెంట్ కోచ్‌గా ఎంపికైన నాయర్‌పై అనుకోకుండా వేటు పడింది. దాంతో.. అతడిని కోల్‌కతా రా రామ్మంటూ ఆహ్వానించింది. అయితే.. 18వ సీజన్లో డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన కోల్‌కతా తీవ్రంగా నిరాశపరిచిన విషయం తెలిసిందే.
తొమ్మిదింట మాత్రమే..
మహిళల ప్రీమియర్ లీగ్ తొలి సీజన్ నుంచి బరిలోకి దిగుతున్న ఐదు జట్లలో యూపీ వారియర్స్ ఒకటి. ఆరంభ ఎడిషన్‌లో కోచ్ జాన్ లెవిస్ మార్గనిర్దేశనంలో యూపీ ప్లే ఆఫ్స్ వరకూ వెళ్లింది. అయితే.. నాకౌట్ పోరు ముంబై ఇండియన్స్ చేతిలో ఓడి ఇంటిదారి పట్టింది. నిరుడు జరిగిన టోర్నీలో యూపీ మూడు విక్టరీలతో నాలుగో స్థానంలో నిలిచింది.
మొత్తంగా డబ్ల్యూపీఎల్‌లో ఆ జట్టు 25 మ్యాచుల్లో తొమ్మిదింట మాత్రమే గెలుపొందింది. ఈసారి మాత్రం ఛాంపియన్‌గా నిలిచేందుకు యూపీ పక్కాగా సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే టాలెంట్ స్కౌట్‌గా, వ్యూహకర్తగా అనుభవమున్న అభిషేక్‌ను ప్రధాన కోచ్‌గా నియమించింది యూపీ మేనేజ్మెంట్.
ఇవి కూడా చదవండి
- Kota Srinivasa Rao | కోట శ్రీనివాసరావు హీరోగా సినిమాల్లోకి రావాలని అనుకున్నారు.. మాజీ ఎమ్మెల్యే సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు
- Jagityal SP Ashok Kumar | అర్ధరాత్రి సమయం లో నిఘా మరింత పటిష్టం.. జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్
- IND vs ENG | క్రీజులో పాతుకుపోయిన రూట్, పోప్.. భారీ స్కోర్ దిశగా ఇంగ్లండ్
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

