IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో ఇంగ్లండ్ జట్టు పటిష్టి స్థితిలో నిలిచింది. రెండో రోజు బజ్ బాల్ ఆటతో ఓపెనర్లు విధ్వంసం సృష్టించగా.. మూడో రోజు మిడిలార్డర్ క్రీజులో పాతుకుపోయారు. జో రూట్ (63 నాటౌట్), ఓలీ పోప్(70 నాటౌట్)లు భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంటూ అర్ధ శతకాలతో చెలరేగారు. పేస్ దళం లో బౌన్స్‌తో ఇబ్బంది పెట్టినా వెరవని ఈ ద్వయం మూడో వికెట్‌కు రన్స్ జోడించింది. లంచ్ సమయానికి ఆతిథ్య జట్టు 2 వికెట్ల నష్టానికి 332 రన్స్ కొట్టింది. ఇంకా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లడ్ 26 పరుగులు మాత్రమే వెనకబడి ఉందంతే.
సిరీస్‌లో కీలకమైన మాంచెస్టర్ టెస్టులో భారత బౌలర్లు తేలిపోతున్నారు. ఇంగ్లండ్ బ్యాటర్లను ఔట్ చేసే మార్గం తెలియక భారీగా పరుగులు ఇచ్చుకుంటున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో 358కే ఆలౌటైన టీమిండియాకు స్వల్ప ఆధిక్యమైనా వస్తుందన్న ఆశను బెన్ డకెట్(94), క్రాలే(84) ద్వయం పటాపంచలు చేసింది. రెండో రోజు లంచ్ తర్వాత ఈ జోడీ విధ్వంసక బ్యాటింగ్‌తో ఇంగ్లండ్ డ్రైవింగ్ సీట్లోకి వచ్చేసింది. బజ్ బాల్ ఆటతో బౌండరీల మోతతో హోరెత్తించిన ఈ ఇద్దరూ అర్ధ శతకాలతో చెలరేగారు. అయితే.. జడేజా ఓవర్లో క్రాలే స్లిప్‌లో రాహుల్ చేతికి చిక్కి వెనుదిరిగాడు. ఆ కాసేపటికే సెంచరీకి చేరువైన డకెట్‌ను అన్షుల్ ఔట్ చేసి తొలి వికెట్ సాధించాడు.
A dominant morning for England, a forgettable one for India as Root and Pope fifties help the hosts close in on a first-innings lead
Ball-by-ball: https://t.co/bFpNZVmJPb pic.twitter.com/sBBzL6v4NX
— ESPNcricinfo (@ESPNcricinfo) July 25, 2025
కానీ, జో రూట్(63 నాటౌట్), ఓలీ పోప్(70 నాటౌట్)లు జిడ్డులా క్రీజులో పాతుకుపోయారు. ఇరువురు మూడో వికెట్‌కు కీలక భాగస్వామ్యంతో భారత బౌలర్లను విసిగిస్తూ ఇంగ్లండ్‌ను పటిష్ట స్థితిలో నిలిపారు. మూడో రోజు అదే జోరు చూపించిన ఈ ఇద్దరూ వికెట్ ఇస్తే ఒట్టు. ప్రమాదకరంగా మారిన ఈ జంటను విడదీసేందుకు కెప్టెన్ గిల్ చేయని ప్రయత్నమంటూ లేదు. నింపాదిగా ఆడుతూ… హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న పోప్, రూట్ టీమిండియా పాలిట విలన్లా తయారవ్వగా.. లంచ్ టైమ్‌కు ఇంగ్లండ్ మూడో రోజు ఒక్క వికెట్ కోల్పోకుండా 332 రన్స్ చేసింది.