కోదాడ, జూలై 25 : శ్రావణమాసం తొలి రోజు సందర్భంగా కోదాడలోని స్థానిక వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో శుక్రవారం రామిశెట్టి కృష్ణవేణి, రావూరి భవాని ఆధ్వర్యంలో మహిళలు శ్రీ పోతులూరి గోవిందమాంబ, సరస్వతి దేవి, శివపార్వతులకు ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అమ్మవారి విగ్రహాలను దేవాలయ ప్రాంగణం నుండి రంగా థియేటర్ చౌరస్తా వరకు ఊరేగించారు. అనంతరం దేవాలయ ప్రాంగణానికి చేరుకుని పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. శ్రావణమాసం తొలిరోజు అమ్మవారికి పూజలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.
పట్టణ ప్రజలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, పాడిపంటలు బాగా పండి ప్రజలు సుఖ సంతోషాలతో ఆనందంగా వర్థిల్లాలని కోరారు. అనంతరం దేవాలయ చైర్మన్ జూకూరి అంజయ్య ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు, పులిహోర పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అన్నదాన నిర్వాహకులు దేవరశెట్టి హనుమంతరావు, బ్యాటరీ చారి, పి.మాధవి, స్వాతి, ఎం.లక్ష్మి, శిరీష, జూకూరి విజయ, ఉదయలక్ష్మి, ఓరుగంటి కృష్ణమూర్తి, బి ఎల్ ఎన్ రెడ్డి పాల్గొన్నారు.