Srilanka Cricket : సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తున్న శ్రీలంకకు పెద్ద షాక్. న్యూజిలాండ్‌పై పొట్టి సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగ (Wanindu Hasaranga) జట్టుకు దూరమయ్యాడు. రెండో టీ20 సందర్బంగా తొడ కండరాల గాయంతో బాధ పడిన హసరంగ విశ్రాంతి తీసుకోనున్నాడు. దాంతో, త్వరలో కివీస్‌తో జరుగబోయే మూడు వన్డేల సిరీస్‌లో ఈ లెగ్ స్పిన్నర్ అందుబాటులో ఉండడం లేదు.
అందుకని లంక సెలెక్టర్లు వన్డే స్క్వాడ్‌లో మార్పు చేశారు. హసరంగకు ప్రత్యామ్నయంగా లంక ఏ జట్టు తరఫున అద్భుతంగా రాణిస్తున్నదుషాన్ హేమంత (Dushan Hemantha)ను జట్టులోకి తీసుకున్నారు. స్పిన్ ఆల్‌రౌండర్ అయిన దుషాన్ ఈమధ్యే సొంతగడ్డపై పాకిస్థాన్‌పై అదరగొట్టాడు.
News Alert: Wanindu Hasaranga ruled out of the ODI series against New Zealand, with Dushan Hemanta stepping in as replacement pic.twitter.com/Abkh9qav8F
— Cricket Addictor (@AddictorCricket) November 12, 2024
స్పిన్‌తో మాయ చేయగల అతడికి సెలెక్టర్లు అరగేంట్రం అవకాశమిస్తూ వన్డే సిరీస్‌కు ఎంపికచేశారు. మరోవైపు న్యూజిలాండ్ హ్యాట్రిక్ హీరో లూకీ ఫెర్గూసన్ సైతం గాయం కారణంగానే వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. లంక, కివీస్‌ల మధ్య నవంబర్ 13న తొలి వన్డే జరుగనుంది.