BGT 2024-25 : కంగరూ గడ్డపై భారత ఆటగాళ్లు బ్యాట్లకు పని చెప్పారు. ఆస్ట్రేలియాపై హ్యాట్రిక్ విజయం కొట్టడమే లక్ష్యంగా ప్రాక్టీస్ మొదలెట్టేశారు. బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీ(Border – Gavaskar Trophy) కోసం ఆసీస్ చేరుకున్న టీమిండియా క్రికెటర్లు ఏమాత్రం ఆలస్యం చేయకుండా రంగంలోకి దిగారు. పెర్త్ స్టేడియంలో రహస్యంగా నెట్స్ ప్రాక్టీస్ కొనసాగించారు. తొలిసారి ఆస్ట్రేలియా గడ్డపై ఆడుతున్న ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (Yashasvi Jaiswal) కాస్త ఎక్కువే చెమటోడ్చాడు.
ఈ ఏడాది టెస్టుల్లో చెలరేగి ఆడిన యశస్వీ పేస్, బౌన్స్‌కు అనుకూలించే ఆసీస్ పిచ్‌లపై కూడా పరుగుల వరద పారించాలనుకుంటున్నాడు. అందుకు తగ్గట్టే ఈ కుర్రహిట్టర్ నెట్స్‌లో భారీ షాట్లు ఆడాడు. ప్రాక్టీస్ సందర్భంగా అతడు కొట్టిన బంతి ఏకంగా స్టేడియం అవతల ఉన్న రోడ్డు మీద పడింది. అయితే.. ఆ సమయంలో అక్కడ వాహనాలు, మనుషలు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Yashasvi Jaiswal gets cracking in the WACA nets #AUSvIND pic.twitter.com/JyLy35MGpv
— ESPNcricinfo (@ESPNcricinfo) November 12, 2024
హెడ్‌కోచ్ గౌతం గంభీర్ ఆధ్వర్యంలో యశస్వీతో పాటు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాలు కూడా తమ బ్యాటింగ్, షాట్ల ఎంపిక మీద బాగానే సాధన చేశారు. నవంబర్ 22న భారత్, ఆస్ట్రేలియాల మధ్య పెర్త్ వేదికగా తొలి టెస్టు జరుగనుంది. ఈ మ్యాచ్‌కు కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులో ఉండడం లేదు. అందుకని రాహుల్, యశస్వీలు ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశముంది.
స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో వైట్‌వాష్ అయిన భారత జట్టు ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌లో వెనకబడింది. హ్యాట్రిక్ ఫైనల్ ఆడాలంటే రోహిత్ సేన ఐదు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించాలి. 2017 నుంచి బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నిలబెట్టుకుంటూ వస్తున్న టీమిండియా ఈసారి కూడా కంగారూలకు చెక్ పెడితే.. ముచ్చటగా మూడోసారి టెస్టు గద పోరులో బరిలోకి దిగే అవకాశముంది.
11 Gangsters ☠💀#INDvsAUS #BorderGavaskarTrophy #ChampionsTrophy2025 #ViratKohli𓃵 pic.twitter.com/fe0POKtBIY
— Mr 𝕏 (@peer_faisal79) November 11, 2024