Pawan Kalyan | మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్.. షెడ్యూల్ ఇదే!
Pawan Kalyan | ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూసుకెళ్తున్నారు. జగన్‌ను ఓడించాలనే పట్టుదలతో టీడీపీ, బీజేపీలను ఒక కూటమిగా ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడాలని లక్ష్యంతో అందర్నీ ఒక్కతాటిపైకి తెచ్చి సంచలన విజయం సాధించారు.
Pawan Kalyan | ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ దూసుకెళ్తున్నారు. జగన్‌ను ఓడించాలనే పట్టుదలతో టీడీపీ, బీజేపీలను ఒక కూటమిగా ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించారు. వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా చూడాలని లక్ష్యంతో అందర్నీ ఒక్కతాటిపైకి తెచ్చి సంచలన విజయం సాధించారు. అలాగే 100 పర్సెంట్ స్ట్రైక్ రేటుతో తన పార్టీని కూడా గెలిపించుకున్నారు. దీంతో పవన్ కల్యాణ్ క్రేజ్ ఏంటో జాతీయ స్థాయిలో అందరికీ అర్థమైంది. ఇప్పుడు అదే క్రేజ్‌ను ప్రధాని మోదీ ఉపయోగించుకోవాలని ప్లాన్ చేసింది. చేస్తున్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే తరఫున ప్రచారం చేయించాలని నిర్ణయించింది.
మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని మహాయుతి కూటమి, కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ హోరాహోరీగా తలపడుతున్నాయి. అయితే మహావికాస్ అఘాడీని ఎదురించి ఎలాగైనా తమ అధికారాన్ని కాపాడుకోవాలని ఎన్డీయే కూటమి ప్రయత్నిస్తున్నది. ఈ నేపథ్యంలోనే ఏపీ ఎన్నికల్లో 100 పర్సెంట్ స్ట్రైక్ రేటుతో సంచలనం సృష్టించిన పవన్ కల్యాణ్‌ను బీజేపీ కూటమి తరఫున ప్రచారానికి దించాలని ప్లాన్ చేసింది. ఇదే విషయమై పవన్ కల్యాణ్‌ను బీజేపీ అధిష్ఠానం సంప్రదిస్తే ఓకే కూడా చెప్పేశారు. దీని ప్రకారం నవంబర్ 16, 17వ తేదీల్లో పవన్ కల్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభలో పాల్గొననున్నారు.
ముఖ్యంగా మహారాష్ట్రలో తెలుగు ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో పవన్ కల్యాణ్ పర్యటన ఉండనున్నట్లు తెలుస్తోంది. తెలుగు ప్రజల్లో పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్‌ను వాడుకుని అక్కడ ఓట్లు రాబట్టుకునేందుకు ప్లాన్ చేసింది. ఇది కాకుండా ఇటీవల తిరుమల లడ్డూ వివాదం సమయంలో సనాతన ధర్మం పరిరక్షణ కోసం ఆయన చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వైరల్ అయ్యాయి. ఇది కూడా తమకు ప్లస్ అవుతుందని బీజేపీ భావించింది. అందుకే పవన్ కల్యాణ్‌ను రంగంలోకి దించుతున్నది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
- Tags
- AP News
- BJP
- Janasena
- Maharashtra
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

