Srilanka Cricket : పొట్టి వరల్డ్ కప్‌లో తీవ్రంగా నిరాశపరిచిన శ్రీలంక (Srilanka) లీగ్ దశలోనే ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. ఒకే ఒక విజయంతో టోర్నీ నుంచి నిష్క్రమించిన వనిందు హసరంగ (Wanindu Hasaranga) సేనపై తాజాగా మీడియాలో సంచలన కథనాలు వచ్చాయి. మెగా టోర్నీలో కీలక మ్యాచ్‌కు ముందు లంక ఆటగాళ్లు ఫూటుగా తాగారని, అందుకనే మైదానంలో విఫలమయ్యారనే వార్త అందర్నీ షాక్‌కు గురి చేసింది. దాంతో శ్రీలంక బోర్డు వరల్డ్ తమ క్రికెటర్లపై వస్తున్న ఆరోపణలపై స్పందించింది.
మెగా టోర్నీలో లంక ఆటగాళ్లు ఎవరూ మందు తాగలేదని.. మీడియాలో వస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణనలే అని కుండబద్ధలు కొట్టింది. ‘శ్రీలంక క్రికెటర్లు పార్టీ చేసుకున్నారనే వార్తలు పూర్తిగా అబద్దం. మందు తాగారు అని నిరూపించడానికి ఒక్క ఆధారం కూడా లేదు. ఆటగాళ్లతో పాటు లంక బోర్డును అప్రతిష్ట పాలు చేయాలనే ఉద్దేశంతోనే సదరు మీడియా సంస్థ ఆ వార్తను ప్రచురించింది. అందుకని ఆ సంస్థ తన పొరపాటును సరిదిద్దుకుంటే మంచిది’ అని లంక బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.
SLC categorically and strongly refutes the contents of the article and confirms that no such incidents, as described, have occurred. Therefore, SLC states unequivocally that the news report is entirely false, fabricated, and baseless.
READ: https://t.co/sr1NHVVKZU #SLC #lka…— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) July 9, 2024
గ్రూప్ డిలోని దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌కు ముందు శ్రీలంక ఆటగాళ్లు నైట్ పార్టీలో మందు తాగారని జూలై 7న లంక మీడియాలో వార్త వచ్చింది. జూన్ 3వ తేదీన సఫారీలో పోరుకు ముందు రోజు రాత్రి టాపార్డర్‌లోని ముగ్గురు, వెటరన్ ఫాస్ట్ బౌలర్‌తో పాటు మేటి ఆల్‌రౌండర్ సైతం హోటల్ రూమ్‌లో అర్ధ రాత్రి దాకా తప్ప తాగారు. వీళ్లకు అసిస్టెంట్ కోచ్ సైతం కంపెనీ ఇచ్చాడు అని ఆ కథనం పేర్కొంది.
దాంతో, వరల్డ్ కప్ మ్యాచ్‌ను లైట్ తీసుకొన్న లంక క్రికెటర్లపై ఆ దేశ అభిమానులు కోపంతో రగిలిపోయారు. అసలే వరల్డ్ కప్ వైఫల్యంపై ఆందోళనగా ఉన్న లంక బోర్డుకు ఈ వార్త పెద్ద తలనొప్పిగా మారింది. అందుకని అవన్నీ అబద్ధాలే అంటూ ఓ ప్రకటన విడుదలు చేసింది. దాంతో.. అభిమానులు కాస్త శాంతించారు.