Team India | శ్రీలంక సిరీస్‌కు రోహిత్ దూరం..! కెప్టెన్ బాధ్యతలు పాండ్యాకేనా..?
Team India | టీమిండియా జూలై, ఆగస్టులో శ్రీలంక టూర్‌కు వెళ్లనున్నది. ఈ పర్యటనల మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్‌లో తలపడనున్నది. ఈ సిరీస్‌కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉన్నది.
Team India | టీమిండియా జూలై, ఆగస్టులో శ్రీలంక టూర్‌కు వెళ్లనున్నది. ఈ పర్యటనల మూడు వన్డేలు, మూడు టీ20 సిరీస్‌లో తలపడనున్నది. ఈ సిరీస్‌కు కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ, ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాలకు విశ్రాంతి ఇచ్చే అవకాశం ఉన్నది. రోహిత్ గైర్హాజరీలో శ్రీలంక పర్యటనకు హార్దిక్, కేఎల్ రాహుల్‌లో ఎవరో ఒకరికి కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అప్పగించే సూచనలున్నాయి. సీనియర్లు విశ్రాంతి కోరడంతో బీసీసీఐ అంగీకరించినట్లు సమాచారం.
వాస్తవానికి రోహిత్ శర్మ గత ఆరునెలలుగా విశ్రాంతి లేకుండానే ఆడుతూ వస్తున్నాడు. డిసెంబర్-జనవరిలో జరిగిన దక్షిణాఫ్రికా టెస్ట్ సిరీస్, ఆఫ్ఘనిస్థాన్‌తో టీ20 ఇంటర్నేషనల్, ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్, ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ వరకు బిజీబిజీగా గడిపాడు. శ్రీలంక పర్యటనలో భారత జట్టు మూడు టీ20లు ఆడనున్నది. తొలి టీ20 ఈ నెల 27న, రెండో టీ20 ఈ నెల 28న, మూడో టీ20 ఈ నెల 30న జరుగనున్నది. ఇక వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ ఆగస్టు 2, మూడో వన్డే 7న జరుగనున్నది. రోహిత్, విరాట్ ఇద్దరు లంక టూర్‌కు దూరం కానుండగా.. మళ్లీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ఇంగ్లండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో తలపడనున్నది. అలాగే, టీమిండియా సెప్టెంబర్-జనవరి మధ్య పది టెస్టులు ఆడనున్నది. ఈ సిరీస్‌లకు సీనియర్లు అందుబాటులో ఉండనున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
బంగ్లాదేశ్‌తో భారత్ రెండు టెస్టులు, ఆ తర్వాత న్యూజిలాండ్‌తో మూడు టెస్టు మ్యాచ్‌లతో పాటు ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడనుంది. ఇక ఛాంపియన్స్ ట్రోఫీ ఫిబ్రవరి నుంచి మార్చి మధ్య జరుగనున్నది. దాంతో సీనియర్ ప్లేయర్స్ లంక టూర్‌కు దూరంగా ఉండాలని రోహిత్ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. రోహిత్ గైర్హాజరీలో పాండ్యా భారత జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉన్నది. ఇటీవల టీ20 ప్రపంచకప్‌లో పాండ్యా వైస్ కెప్టెన్ వ్యవహరించగా.. అదే సమయంలో కేఎల్ రాహుల్ పేరు సైతం బలంగా వినిపిస్తున్నది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

