Bharateeyudu 2 | కమల్‌హాసన్ (Kamal Haasan) టైటిల్ రోల్ పోషిస్తున్న మోస్ట్ ఎవెయిటెడ్ ప్రాంచైజీ మూవీ ఇండియన్ 2 (Indian 2). స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం జులై 12న తమిళం, తెలుగుతోపాటు పలు ప్రధాన భారతీయ భాషల్లో వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా విడుదలవుతుంది. తెలుగులో భారతీయుడు 2గా విడుదల కానుంది. అయితే విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో అడ్వాన్స్ బుకింగ్స్ న్యూస్ ఒకటి తెరపైకి వచ్చింది.
ఇప్పటికే ప్రమోషన్స్‌లో భాగంగా కమల్ హాసన్ టీం. తాజా టాక్ ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో భారతీయుడు 2 బుకింగ్స్‌కు సంబంధించి అప్డేట్ వచ్చేసింది. తాజా సమాచారం ప్రకారం ఇవాళ సాయంత్రం నుంచి బుకింగ్ షురూ కానున్నాయట. మరి మేకర్స్ అధికారికంగా ఏదైనా వార్త అందిస్తారనేది చూడాలి. టికెట్స్ ధరలపై (స్పెషల్ షోలు) కూడా ప్రభుత్వ నిర్ణయం ఎలా ఉండబోతున్నాయన్నది తెలియాల్సి ఉంది.
అవినీతి, లంచం వంటి ఇంట్రెస్టింగ్ కథాంశాల చుట్టూ తిరిగే ఈ మూవీలో ఎస్జే సూర్య, బాబీ సింహా, సిద్దార్థ్, సముద్రఖని, లెజెండరీ కమెడియన్ బ్రహ్మానందం, మధుబాల, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా భవానీ శంకర్, కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ -రెడ్ జియాంట్ మూవీస్‌పై ఉదయనిధి స్టాలిన్-సుభాస్కరన్ తెరకెక్కిస్తున్నారు.
ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ సూపర్ హిట్ టాక్‌తో స్క్రీనింగ్ అవుతున్న నేపథ్యంలో భారతీయుడు 2 సక్సెస్ అవ్వాలంటే మౌత్ టాక్ మరింత స్ట్రాంగ్‌గా ఉండాల్సిందే. మరి ప్రేక్షకుల రియాక్షన్ ఎలా ఉంటుందనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
Sara Ali Khan | అనంత్ అంబానీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో సారా అలీఖాన్ మెరుపులు
SSMB 29 | అప్పుడు ప్రభాస్.. ఇప్పుడు మహేశ్ బాబు.. ఎస్ఎస్ఎంబీ 29 క్రేజీ వార్తేంటో తెలుసా..?
Shankar | మమ్మల్ని నమ్మండి… అంతకంటే ఎక్కువే శ్రమించాం.. డైరెక్టర్ శంకర్ కామెంట్స్ వైరల్
Indian 2 | ఇండియన్ 3 ట్రైలర్ అప్పుడే.. గేమ్ ఛేంజర్ రిలీజ్‌పై ఎస్జే సూర్య ఏమన్నాడంటే..?