ICC Rankings : పునరామనంలో ఒత్తిడి అనేదే లేకుండా చెలరేగి ఆడుతున్న భారత ఓపెనర్ షఫాలీ వర్మ (Shafali Verma) ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చింది. మునపటి ఫామ్‌తో బౌలర్లను వణికించిన ఈ లేడీ సెహ్వాగ్ ఐసీసీ మహిళల ర్యాంకింగ్స్ (ICC T20 Rankings )లో మళ్లీ టాప్-10లో నిలిచింది. ఇంగ్లండ్‌తో జరిగిన పొట్టి సిరీస్‌లో పరుగుల వరద పారించిన షఫాలీ టీ20 బ్యాటర్లలో తొమ్మిదో స్థానం దక్కించుకుంది. తొలి సిరీస్‌లోనే అద్భుతంగా రాణించిన తెలుగమ్మాయి శ్రీ చరణి (Sree Charani) ఏకంగా టాప్ టెన్‌లో నిలవడం విశేషం. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్న ఈ స్పిన్ కెరటం ఆరో ర్యాంక్ కైవసం చేసుకుంది.
భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) మూడో ప్లేస్‌లో కొనసాగుతుండగా.. రెండు స్థానాల్ని కోల్పోయిన మిడిలార్డర్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ 14వ ర్యాంక్ సాధించింది. ఇంగ్లండ్ చరిత్రాత్మక పొట్టి సిరీస్ విజయంలో కీలక పాత్ర పోషించిన రాధా యాదవ్ బౌలర్ల ర్యాంకింగ్స్‌లో 5 వ స్థానంలో నిలిచింది. పేసర్ అరుంధతీ రెడ్డి నాలుగు స్థానాలు మెరుగుపరచుకొని 36వ ర్యాంక్ సొంతం చేసుకుంది. ఆల్‌రౌండర్ దీప్తి శర్మకు మాత్రం షాక్ తగిలింది. టాప్ 2లో ఉన్న ఆమె మూడో స్థానానికి పడిపోయింది.
🚨 BREAKING 🚨
Shafali Verma moves up to No. 9 in the ICC Women’s T20I batters rankings after her strong performance in the England series. 🇮🇳#Cricket #Shafali #India #T20I pic.twitter.com/bgkf9SF5uv
— Sportskeeda (@Sportskeeda) July 15, 2025
మహిళా బ్యాటర్ల టాప్ -5 ర్యాంకింగ్స్ : బేత్ మూనీ (ఆస్ట్రేలియా), హేలీ మాథ్యూస్(వెస్టిండీస్), స్మృతి మంధానా(భారత్), తహ్లియా మెక్‌గ్రాత్(ఆస్ట్రేలియా), లారా వొల్వార్త్డ్(దక్షిణాఫ్రికా).
మహిళా బౌలర్ల టాప్ -5 ర్యాంకింగ్స్ : సదియా ఇక్బాల్(పాకిస్థాన్), అనబెల్ సథర్లాండ్(ఆస్ట్రేలియా), దీప్తి శర్మ(భారత్), సోఫీ ఎకిల్‌స్టోన్(ఇంగ్లండ్), లారెన్ బెల్(ఇంగ్లండ్).
మహిళా ఆల్‌రౌండర్ల టాప్ -5 ర్యాంకింగ్స్ : హేలీ మాథ్యూస్(వెస్టిండీస్), అమేలి కేర్(న్యూజిలాండ్), దీప్తి శర్మ(భారత్), అష్ గార్డ్నర్(ఆస్ట్రేలియా), చమరి ఆటపట్టు (శ్రీలంక).
పొట్టి క్రికెట్ సంచలనం షఫాలీ మరోసారి తన మెరుపులతో ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఫామ్‌లేమితో ఏడాది పాటు జట్టుకు దూరమైన ఈ డాషింగ్ ఓపెనర్ ఇంగ్లండ్ పర్యటనలో మెరుపు బ్యాటింగ్‌తో బెంబేలెత్తిస్తోంది. ఈమధ్యే ముగిసిన ఐదు మ్యాచ్‌ల పొట్టి సిరీస్‌లో 158.56 స్ట్రయిక్ రేటుతో 176 రన్స్ కొట్టింది.