Team India | టీమిండియా మెన్స్, వుమెన్స్ జట్లు ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్నాయి. శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని మెన్స్ టీమ్ ఐదు టెస్టుల సిరీస్‌ను ఆడుతున్నది. హర్మన్ ప్రీత్ కౌర్ నేతృత్వంలోని వుమెన్స్ టీమ్ మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడుతున్నది. ఇంతకుముందు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో ఇంగ్లాండ్‌ను 3-2 తేడాతో ఓడించింది. రెండుజట్లకు కింగ్ చార్లెస్ ఆతిథ్యం ఇచ్చారు. లండన్‌లోని సెయింట్ జేమ్స్ ప్యాలెస్‌లో మంగళవారం రెండుజట్లు కింగ్ చార్లెస్-3ని కలిశాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ కింగ్ చార్లెస్‌ను కలిసి మాట్లాడడం బాగుందన్నారు.
The United Kingdom: King Charles III met the players of the Indian Men’s and Women’s Cricket team, the coach, staff members and BCCI officials, at St. James’s Palace in London. pic.twitter.com/ZFMJGep1Xq
— ANI (@ANI) July 15, 2025
మహ్మద్ సిరాజ్ అవుట్ అయిన విధానంపై కింగ్ ఛార్లెస్ స్పందించారని చెప్పాడు. లార్డ్స్ టెస్టులో చివరి బ్యాట్స్‌మెన్ అవుట్ అయిన తీరు దురదృష్టకరమని అన్నారని కెప్టెన్ పేర్కొన్నాడు. మ్యాచ్‌లో ఫలితం ఎలాగైనా ఉండవచ్చని ఆయనతో అన్నామని.. రాబోయే రెండు మ్యాచుల్లో మాకు అదృష్టం కలిసివస్తుందని ఆశిస్తున్నాం’ అని అన్నట్లుగా గిల్ పేర్కొన్నాడు. లార్డ్స్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్ గురించి గిల్ మాట్లాడుతూ రెండు జట్లు ఆడిన విధానం బాగుందని.. చాలా ఉత్సాహాన్ని చూపించారని తెలిపాడు. తాము అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చామని చెప్పాడు. తాము అదృష్టవంతులమని.. ఎక్కడికి వెళ్లినా అభిమానుల నుంచి మంచి మద్దతు లభిస్తుందని చెప్పుకొచ్చాడు.
#WATCH | The United Kingdom: King Charles III pose with the players of the Indian Men’s and Women’s Cricket team, the coach, staff members and BCCI officials, at St. James’s Palace in London. pic.twitter.com/YRhQPcXvuw
— ANI (@ANI) July 15, 2025
లార్డ్స్ వేదికగా జరిగిన మూడో టెస్టు చివరి రోజు సోమవారం జోఫ్రా ఆర్చర్, బెన్ స్టోక్స్ అద్భుత బౌలింగ్‌తో టీమిండియా టాప్, మిడిలార్డర్‌ను కుప్పకూల్చారు. 193 పరుగుల విజయ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో టీమిండియా ఒక దశలో ఏడు వికెట్ల నష్టానికి 82 పరుగులు చేసి దాదాపు ఓటమి అంచుకు చేరుకుంది. అయినా, భారత జట్టు చివరి వరకు పోరాడింది. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా 181 బంతుల్లో 61 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఇద్దరూ అండగా నిలిచారు. కేవలం విజయానికి 22 పరుగుల దూరంలో ఉండగా భారత జట్టు చివరి వికెట్ రూపంలో సిరాజ్ అవుట్ అవడంతో టీమిండియా పోరాటం ముగిసింది.