చౌటుప్పల్, జూలై 15 : గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్) జిల్లా మహా సభలను విజయవంతం చేయాలని ఆ సంఘం ఉమ్మడి నల్లగొండ జిల్లా గౌరవాధ్యక్షుడు బండారు నర్సింహ్మ పిలుపునిచ్చారు. మంగళవారం చౌటుప్పల్ మండల కేంద్రంలో వృత్తిదారుల సంఘ భవనంలో మహాసభల కరపత్రాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఈ నెల 22, 23 తేదీల్లో సభను రాయగిరిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంపకందారులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మహాసభలో పెంపకందారుల సమస్యలను చర్చించి వాటి పరిష్కారానికి భవిష్యత్ కార్యాచరణ రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కొండె శ్రీశైలం, బీమనగోని బాలరాజు యాదవ్, గజ్జి పాండు, ఎర్రగోని మల్లేశ్, గడగోటి జంగయ్య, బేడద రమేశ్, బేడద జంగయ్య, ఆరిగే బీరప్ప, గునమోని అయిలయ్య పాల్గొన్నారు.