Smriti Mandhana : భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన(103 నాటౌట్) పొట్టి క్రికెట్లో తొలి సెంచరీ కొట్టింది. నాటింగ్హమ్లోని ట్రెంట్బ్రిడ్జిల్ జరుగుతున్న తొలి టీ20లో బౌండరీలతో విరుచుకుపడిన మంధాన.. 51 బంతుల్లోనే శతకానికి చేరువైంది. లారెన్ బౌలింగ్లో వరుస బౌండరీలో చెలరేగిన భారత సారథి ఈ ఫార్మాట్లో మొదటిసారి మూడంకెల స్కోర్ అందుకుంది. భారత్ నుంచి ఈ ఘతన సాధించిన తొలి మహిళా క్రికెటర్ తనే కావడం విశేషం.
మంధాన కంటే ముందు ఇంగ్లండకు చెందిన హీథర్ నైట్, టమ్మీ బ్యూమంట్, ఆస్ట్రేలియా బ్యాటర్ బేత్ మూనీలు పొట్టి ఫార్మాట్లో సెంచరీలు సాధించారు. బ్యూమంట్ ఏకంగా రెండుసార్లు వంద కొట్టిన తొలి మహిళా క్రికెటర్గా రికార్డు సృష్టించింది.
Women with centuries in all formats in international cricket:
Heather Knight
Tammy Beaumont
Laura Wolvaardt
Beth Mooney
𝗦𝗺𝗿𝗶𝘁𝗶 𝗠𝗮𝗻𝗱𝗵𝗮𝗻𝗮 pic.twitter.com/T6S8EZSzXA— ESPNcricinfo (@ESPNcricinfo) June 28, 2025