ఇల్లెందు, జూన్ 28 : విద్యార్థినీ విద్యార్థులు చిన్న వయసు నుండే అపరిచిత వ్యక్తులతో అప్రమత్తంగా ఉండాలని ఇల్లెందు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి దేవరపల్లి చంద్రిక రెడ్డి అన్నారు. శనివారం సాయంత్రం ఇల్లెందు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇల్లెందు మండల న్యాయ సేవాధికార సంస్థ వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన న్యాయ చైతన్య సదస్సుకు ఆమె హాజరై మాట్లాడారు. విద్యార్థిని, విద్యార్థులు మత్తు పదార్థాల వినియోగం, వాటి వల్ల కలిగే దుష్ఫలితాలు, అక్రమ రవాణా అరికట్టడంపై చిన్న వయస్సు నుండే అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఇల్లెందు బార్ అధ్యక్షుడు కె.ఉమామహేశ్వరరావు, ప్రధాన కార్య దర్శి కీర్తి కార్తిక్, సీనియర్ న్యాయవాదులు కొండ నారాయణ, ఎస్.వెంకటేశ్వర్లు, పాఠశాల హెచ్.ఎం ఓ ఉమా శంకర్, బోధన, బోధనేతర, కోర్టు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.