తాండూర్, జూన్ 28: నర్సాపూర్ వద్ద బ్రిడ్జి నిర్మించి రైతులకు, ఆదివాసీలకు రవాణా సౌకర్యం కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కనికరపు అశోక్ డిమాండ్ చేశారు. శనివారం మండలంలోని నర్సాపూర్ ఆదివాసీ గుడానికి వెళ్లిన ఆయన ఆదివాసీలు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వాగు వద్ద తాత్కాలికంగా ఏర్పాటు చేసిన రోడ్ డ్యాంను పరిశీలించారు. గింది. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ.. నర్సాపూర్ గ్రామ ఆదివాసీలు, రైతులు ఏం పాపం చేశారని పాలకులు బ్రిడ్జి నిర్మాణం చెయ్యడం లేదని మండిపడ్డారు.
గతంలో వర్షాలు పడి వాగు పొంగి పొర్లడంతో రాకపోకలు స్తంభించాయి. ఆ సమయంలో అనారోగ్యంతో ఉన్న గ్రామ పటేల్‌కు సకాలంలో వైద్యం అందక మరణించారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. వర్షాకాలంలో ఆదివాసీలు, ఇతర గ్రామల నుంచి వచ్చే రైతులకు ఈ వాగు ఇబ్బందికరంగా మారింది. జిల్లా అధికారులు, స్థానిక ఎమ్మెల్యే స్పందించి వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేయించాలని అశోక్ డిమాండ్ చేశారు. రోడ్ డ్యాంను పరిశీలించిన వాళ్లలో ఆత్రం బాదిరావు, సోయం ప్రభకర్, కుర్సింగ దిందర్ సావ్, కుమురం జంగు, కొట్నాక శ్యామ్ రావ్, ఆత్రం భీం రావ్, కొట్నాక చిత్తరావ్, గ్రామ ప్రజలు ఉన్నారు.