IND vs ENG : నిర్ణయాత్మక ఓవల్ టెస్టులో భారత పేసర్ల ఇంగ్లండ్ బ్యాటర్లకు దడ పుట్టించారు. లంచ్ తర్వాత సంచలన స్పెల్‌తో ఆతిథ్య జట్టును ఆలౌట్ చేశారు. ఓవైపు ప్రసిధ్ కృష్ణ(4-62) మరోవైపు మహ్మద్ సిరాజ్(4-84)ల విజృంభణతో ఇంగ్లండ్ టీ సెషన్ తర్వాత కుప్పకూలింది. వర్షం అంతరాయం కలిగించిన తర్వాత హ్యారీ బ్రూక్ (53) అర్ధ శతకంతో స్కోర్ వేగం పెంచాలనుకున్నాడు. కానీ, అతడిని బౌల్డ్ చేసిన సిరాజ్ రొనాల్డో తరహాలో సంబురాలు చేసుకున్నాడు. ఓపెనర్ల విధ్వంసంతో శుభారంభం లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయిన పోప్ సేన తొలి ఇన్నింగ్స్ 247 కే ముగిసింది. ఇంగ్లండ్ 23 రన్స్ లీడ్‌లో ఉంది.
ఓవల్ టెస్టులో రెండో రోజు రసవత్తరంగా సాగుతోంది. భారత బౌలర్లు పంజా విసరడంతో ఇంగ్లండ్ అనూహ్యంగా ఆలౌట్ అయింది. లైన్ అండ్ లెంగ్త్‌తో ప్రత్యర్థి బ్యాటర్లకు ముకుతాడు వేసిన పేస్ ద్వయం మ్యాచ్‌ను మలుపు తిప్పింది. రెండో రోజు తొలి సెషన్లో ఓపెనర్ల బెన్ డకెట్(43), జాక్ క్రాలీ(64)ల విధ్వంసంతో భయపెట్టారు. బౌండరీలతో చెలరేగి తొలి వికెట్‌కు.. 92 రన్స్ జోడించగా ఇంగ్లండ్ భారీ స్కోర్ దిశగా సాగింది. కానీ, లంచ్ తర్వాత ఆతిథ్య జట్టు తడబాటుతో సగం వికెట్లు కోల్పోయింది. లంచ్ తర్వాత భారత పేస్ ద్వయం ప్రసిధ్ కృష్ణ(4-62), సిరాజ్(4-84) జోరుతో ఆతిథ్య జట్టు బ్యాటింగ్ లైనప్ కకావికలమైంది.
Innings Break!
Impressive bowling display from #TeamIndia! 🙌
4⃣ wickets each for Prasidh Krishna and Mohammed Siraj
1⃣ wicket for Akash DeepScorecard ▶️ https://t.co/Tc2xpWMCJ6#ENGvIND | @prasidh43 | @mdsirajofficial pic.twitter.com/Xk7N26i5Wj
— BCCI (@BCCI) August 1, 2025
సిరాజ్ జోరుతో..
ఓలీ పోప్(22) జో రూట్(29)లను ఎల్బీగా ఔట్ చేసి ఆతిథ్య జట్టును దెబ్బకొట్టిన మియా భాయ్.. కాసేపటికే కొత్త కుర్రాడు జాకబ్ బెథెల్(6)ను యార్కర్‌తో వెనక్కి పంపాడు. వరుసగా ఏడో ఓవర్ వేసిన అతడు ఆడడానికి ఏమాత్రం వీలులేని బంతితో బెథెల్ ఇన్నింగ్స్‌కు ముగింపు పలికాడు. అంతే.. ఇంగ్లండ్ 195కే ఐదో వికెట్ కోల్పోయింది. అప్పటికీ భారత స్కోర్‌కు 28 రన్స్ వెనుకంజలో ఉంది పోప్ సేన. కష్టాల్లో పడిన జట్టును హ్యారీ బ్రూక్(52 ), ఆపద్భాందవుడు జేమీ స్మిత్(5 నాటౌట్)లు గట్టెక్కించే బాధ్యత తీసుకున్నారు.
కానీ, టీకి ముందు ఒకే ఓవర్లో ప్రసిధ్ కృష్ణ.. స్మిత్, జేమీ ఓవర్టన్‌లను ఔట్ చేసి ఇంగ్లండ్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. బ్రేక్ తర్వాత ధనాధన్ ఆడుతున్న అట్కిన్సన్(11)ను డగౌట్ చేర్చిన ప్రసిధ్ నాలుగో వికెట్ పడగొట్టాడు. కాసేపటికే వర్షం అంతరాయంతో ఆలౌట్ ప్రమాదం తప్పించుకున్న ఇంగ్లండ్‌ను సిరాజ్ వెంటాడాడు. హాఫ్ సెంచరీ బాదిన బ్రూక్‌ను బౌల్డ్ చేసి ఆ జట్టు ఇన్నింగ్స్‌కు తెరదించాడు.
Siraj breathing fire 🔥
His 3⃣rd success with the ball! 🙌 🙌
England 5 down as Jacob Bethell departs.
Updates ▶️ https://t.co/Tc2xpWMCJ6#TeamIndia | #ENGvIND | @mdsirajofficial pic.twitter.com/nhUpEYAleB
— BCCI (@BCCI) August 1, 2025