ఆదివారం 07 మార్చి 2021
Sports - Feb 11, 2021 , 16:44:23

చాహల్‌ భార్యతో స్టెప్పులేసిన శ్రేయస్‌..వీడియో వైరల్‌

చాహల్‌ భార్యతో స్టెప్పులేసిన శ్రేయస్‌..వీడియో వైరల్‌

టీమ్‌ఇండియా క్రికెటర్‌  శ్రేయస్‌ అయ్యర్‌, స్పిన్నర్‌  యుజువేంద్ర చాహల్‌ సతీమణి ధనశ్రీ వర్మతో కలిసి డ్యాన్స్‌ చేశాడు. రోసెస్‌ పాటకు వీరిద్దరూ ప్రొఫెషనల్‌ డ్యాన్సర్లలా స్టెప్పులు వేశారు. జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా సరదాగా పాటకు డ్యాన్స్‌ చేసినట్లు తెలుస్తోంది.  దీనికి సంబంధించిన వీడియోను శ్రేయస్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశాడు.  మా పాదాలవైపు చూస్తున్నారా? అంటూ క్యాప్షన్‌ జోడించాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. 

వీరిద్దరు స్టెప్పులేసిన వీడియోను ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్య, స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ భార్య పృథ్వీ నారాయణన్‌, ఫీల్డింగ్‌ కోచ్‌ ఆర్‌ శ్రీధర్‌ తదితరులు సోషల్‌మీడియాలో మెచ్చుకున్నారు. ధనశ్రీ వర్మను చాహల్‌ గతేడాది డిసెంబర్‌లో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.   

 

VIDEOS

logo