Ranji Trophy : భారత స్టార్ ఆటగాడు శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) ఎట్టకేలకు సెంచరీ కల నిజమైంది. సెంట్రల్ కాంట్రాక్ట్‌తో పాటు టెస్టు జట్టులో చోటు కోల్పోయిన అతడు దేశవాళీలో మూడేండ్ల తర్వాత శతకంతో మెరిశాడు. దేశవాళీ సీజన్ 2024-25లో గత ఆరు ఇన్నింగ్స్‌ల్లో 154 పరుగులతో నిరాశ పరిచిన అయ్యర్ శనివారం కసిదీరా కొట్టాడు. రంజీ ట్రోఫీ (Ranji Trophy)లో ముంబై తరఫున బరిలోకి దిగిన అతడు మహరాష్ట్ర బౌలర్లపై ఆధిపత్యం చెలాయిస్తూ వంద బాదేశాడు. దేశవాళీలో అతడికి ఇది 14వ సెంచరీ కావడం విశేషం. తన సూపర్ ఇన్నింగ్స్‌తో అతడు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 6 వేల పరుగుల మైలురాయికి చేరువయ్యాడు.
తొలి ఇన్నింగ్స్‌లో మహారాష్ట్రను126కే కట్టడి చేసిన ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ పృథ్వీ షా(1)ను ప్రదీప్ దఢే ఎల్బీగా వెనక్కి పంపాడు. ఆ కాసేపటికే వికెట్ కీపర్ హార్దిక్ తోమర్(4) సైతం ప్రదీప్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. ఓపెనర్ అయుశ్ హత్రే(176)తో ఇన్నింగ్స్ నిర్మించిన కెప్టెన్ అజింక్యా రహానే(31) స్వల్ప స్కోర్‌కే వెనుదిరగగా.. ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అయ్యర్ సాధికారికంగా ఆడాడు.
The Moment Shreyas iyer completed his Century 👏❤️#ShreyasIyer pic.twitter.com/18IerYc7cf
— OG DHRUV ™ #ComebackLoading (@G4YforShrey) October 19, 2024
యువకెరటం అయుశ్ జతగా 200 పరుగుల విలువైన భాగస్వామ్యం నెలకొల్పాడు. కళాత్మక షాట్లతో అలరించిన అయ్యర్131 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో శతకం సాధించాడు. అయితే.. హితేశ్ వలుంజ్(134/6) విజృంభణతో సహచరులు పెవిలియన్‌కు క్యూ కట్టగా.. అయ్యర్ సైతం 142 పరుగుల వద్ద ఔటయ్యాడు. దాంతో, ముంబై 441 పరుగులకే ఆలౌటయ్యింది. అనంతరం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన మహారాష్ట్ర ఒక వికెట్ కోల్పోయింది. ఇంకా 173 పరుగులు వెనకబడి ఉంది.