Cabinet Meeting | రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిపడింది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 23న జరగాల్సి ఉండగా.. 26వ తేదీకి వాయిదా వేసినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. 26న సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సమావేశం జరుగుతుందని పేర్కొన్నారు. అయితే, కేబినెట్ మీటింగ్ వాయిదాపడడానికి కారణాలు తెలియరాలేదు. అయితే, కేబినెట్ మీటింగ్‌లో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలతో పాటు హైడ్రా ఆర్డినెన్స్‌కు చట్టబద్ధత కల్పించడం, రెవెన్యూ చట్టం, మూసీ బాధితుల అంశం, వరద నష్టం, రైతు భరోసా తదితర అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తున్నది. ఈ మేరకు వివరాలను సిద్ధం చేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం.