IND vs NZ 1st Test : చిన్నస్వామి స్టేడియంలో భారత ఇన్నింగ్స్ ముగిసింది. నాలుగో రోజు సర్ఫరాజ్ ఖాన్(150) భారీ శతకం, రిషభ్ పంత్(99) విధ్వంసక బ్యాటింగ్‌తో కోలుకున్న టీమిండియా అనూహ్యంగా ఆఖరి సెషన్లో ఆలౌటయ్యింది. న్యూజిలాండ్ పేసర్లు విలియం ఓ రూర్కీ(9/23), మ్యాట్ హెన్రీ(102/3), విజృంభణతో టీ సెషన్ తర్వాత 462 పరుగులకే రోహిత్ సేన కుప్పకూలింది. 106 పరుగుల ఆధిక్యం సాధించిందంతే. అనంతరం న్యూజిలాండ్ ఇన్నింగ్స్ ఆరంభించి ఒక్క ఓవర్ కాకముందే అంపైర్లు ఆటను నిలిపివేశారు. స్టేడియం మీద దట్టమైన నల్లని మేఘాలు కమ్ముకోవడంతో.. వర్ష సూచన, వెలుతురు లేమి కారణాలతో మ్యాచ్‌ను ఆపేశారు.
స్వదేశంలో మరీ చెత్తగా 46 పరుగులకే ఆలౌట్ అయిన అవమానంంతో భారత ఆటగాళ్లు రెచ్చిపోయారు. మూడో రోజు కివీస్‌ను త్వరగానే ఆలౌట్ చేసిన టీమిండియా.. రెండో ఇన్నింగ్స్‌లో పరుగుల వరద పారిస్తోంది. ఓపెనర్లు రోహిత్ శర్మ(52), యశస్వీ జైస్వాల్(35)లు దూకుడుగా ఆడి తమ ఉద్దేశాన్ని చాటారు. ఈ ఇద్దరూ వెనుదిరిగాక విరాట్ కోహ్లీ(70) జతగా సర్ఫరాజ్ ఖాన్(150) సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. దాంతో, టీమిండియా స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.
India collapse from 408-4 to 462 all out after New Zealand took the new ball 😮
Tom Latham’s side need just 107 runs to record a win in Bengaluru 🎯 https://t.co/tzXZHnJPJI #INDvNZ pic.twitter.com/VAUKfDxqm0
— ESPNcricinfo (@ESPNcricinfo) October 19, 2024
తొలి ఇన్నింగ్స్‌లో వణికించిన మ్యాట్ హెన్రీ, విలియం ఓరూర్కీలను ఉతికేస్తూ కోహ్లీ, సర్ఫరాజ్ బౌండరీల మోత మోగించారు. మూడో రోజు ఆట ముస్తుందనగా ఆఖరి బంతికి విరాట్ ఔటయ్యాడు. నాలుగో రోజు సర్ఫరాజ్, రిషభ్ పంత్(99)లు సుడిగాలి ఇన్నింగ్స్‌తో కివీస్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించారు. దాంతో, టీమిండియా ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే.. 150 పరుగులు చేసిన సర్ఫరాజ్‌ను సౌథీ వెనక్కి పంపాడు.
Here’s hoping Rishabh Pant’s tally of Test hundreds goes way ahead of his number of scores in the nineties 🤞https://t.co/KJ5emRBK7k #INDvNZ pic.twitter.com/SIwwsRaIN1
— ESPNcricinfo (@ESPNcricinfo) October 19, 2024
టీ సెషన్‌కు ముందు విలియం ఓ రూర్కీ వికెట్ల వేటకు తెర తీశాడు. సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉన్న పంత్‌ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్(12), రవీంద్ర జడేజా(5) వికెట్ సాధించి భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టాడు. రూర్కీని చూసి రెచ్చిపోయిన హెన్రీ వరుసగా అశ్విన్(15), బుమ్రా(0), సిరాజ్(0)లను వెనక్కి పంపి భారత ఇన్నింగ్స్‌కు తెరదించాడు.