PV Sindhu | పీవీ సింధుకు మరో ఏడాదిపాటు ఆన్‌డ్యూటీ.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
PV Sindhu | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధుకు ఆన్ డ్యూటీ సదుపాయాన్ని మరో ఏడాది పొడిగించింది. ఆసియా, కామన్వెల్త్ క్రీడలతో పాటు 2025-26లో వివిధ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు శిక్షణ నిమిత్తం పీవీ సింధుకు ఆన్ డ్యూటీ సదుపాయాన్ని పొడిగించింది.
PV Sindhu | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్న బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధుకు ఆన్ డ్యూటీ సదుపాయాన్ని మరో ఏడాది పొడిగించింది. ఆసియా, కామన్వెల్త్ క్రీడలతో పాటు 2025-26లో వివిధ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు శిక్షణ నిమిత్తం పీవీ సింధుకు ఆన్ డ్యూటీ సదుపాయాన్ని పొడిగించింది. వచ్చే ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఓడీని పొడిగిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు 2016 ఒలింపిక్స్‌లో సిల్వర్ మెడల్ సాధించారు. దీంతో అప్పటి తెలుగు ప్రభుత్వాలు పీవీ సింధును ఘనంగా సన్మానించడంతో పాటు నజరానా ప్రకటించాయి. గ్రూప్-1 హోదాతో ప్రభుత్వ ఉద్యోగం కూడా ఆఫర్ చేశాయి. అయితే ఏపీలో ప్రభుత్వ ఉద్యోగం చేసేందుకు పీవీ సింధు సుముఖత వ్యక్తం చేశారు. తొలుత విజయవాడ గొల్లపూడిలోని ఏపీ భూ పరిపాలన ప్రధాన కమిషనర్ (సీసీఎల్ఏ) కార్యాలయంలో పీవీ సింధు విధుల్లో చేరారు. డిప్యూటీ కలెక్టర్ విధులు, బాధ్యతలపై శిక్షణ తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె హైదరాబాద్‌లో ఏపీ ప్రభుత్వం ఆధీనంలో ఉన్న లేక్‌వ్యూ అతిథిగృహంలో ఓఎస్డీగా విధులు నిర్వహిస్తున్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KTR | జమ్మి పూజ, పాలపిట్ట దర్శనం.. తెలంగాణ సంప్రదాయాన్ని గుర్తు చేస్తూ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు!
Warangal Hospital | వరంగల్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన ప్రారంభోత్సవం వాయిదా
Rains | బంగాళాఖాతంలో అల్ప పీడనం.. మూడు రోజులు వర్షాలు..!
Tiger Shroff | కళాకారులు సులభమైన టార్గెట్లు.. టైగర్ ష్రాఫ్ ఘటనపై స్పందించిన ‘ధురంధర్’ నటుడు!
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

