అమరావతి : ఏపీలో మహిళలు, చిన్నారులు, యువతులపై దారుణాలు కొనసాగుతున్నాయి. శనివారం వైఎస్సార్ జిల్లా బద్వేల్ సమీపంలోని గోపాలపురం సెంచరీ ప్లైవుడ్ వద్ద దారుణమైన ఘటన చోటు చేసుకుంది.
ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిపై(Inter student) విఘ్నేష్ అనే యువకుడు తీసుకెళ్లి ముళ్లపొదల వద్ద ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో ఆమె కేకలు వేయడంతో సమీపంలో పొలం వద్ద పనులు చేసుకుంటున్న స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రగాయలపాలై కొన ఊపిరితో ఉన్న విద్యార్థినిని బద్వేల్ ఆసుపత్రికి, అక్కడి నుంచి కడప రిమ్స్‌కు(Kadapa RIMS) తరలించారు.
విషయం తెలుసుకున్న ఎస్పీ హర్షవర్ధన్‌రాజు (SP Harsavardan reddy) హుటాహుటిన ఘటనస్థలానికి బయలు దేరారు. నిందితుడు విఘ్నేష్ కోసం 4 ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. కొంతకాలంగా ఇరువురు సాన్నిహిత్యంగా ఉండి ఇటీవల యువకుడు మరో యువతిని వివాహం చేసుకోన్నాడు. ఇదే విషయమై ఇరువురి మధ్య ఘర్షణకు దారితీసి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితుడు దొరికితేనే పూర్తి సమాచారం తెలుస్తుందని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న బద్వేల్ గ్రామీణ పోలీసులు తెలిపారు. కాగా 60శాతం వరకు విద్యార్థిని గాయపడిందని వెల్లడించారు.