Headingley Test : హెడింగ్లే టెస్టు రసవత్తరంగా సాగుతోంది. అభిమానులకు అసలైన క్రికెట్ మజాను పంచుతున్న ఈ మ్యాచ్ రెండో సెషన్లో భారత బౌలర్లు వికెట్ల వేట కొనసాగిస్తున్నారు. ఓపెనర్ జాక్ క్రాలేను ఔట్ చేసి ప్రసిధ్ కృష్ణ(2-69) తొలి బ్రేక్ ఇవ్వగా.. శార్దూల్ ఠాకూర్(2-25) వరుస బంతుల్లో రెండు వికెట్లతో ఇంగ్లండ్‌ను దెబ్బ తీశాడు. సెంచరీతో క్రీజులో పాతుకుపోయిన బెన్ డకెట్(149)ను వెనక్కి పంపిన అతడు.. ఆ తర్వాత హ్యారీ బ్రూక్(0)ను డకౌట్‌గా పెవిలియన్ చేర్చి హ్యాట్రిక్‌పై నిలిచాడు.
అయితే.. బెన్ స్టోక్స్(5 నాటౌట్) వికెట్ కాపాడుకున్నాడు. శార్దూల్ విజృంభణతో 253కే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది ఆతిథ్య జట్టు. ఈ పరిస్థితుల్లో టీమ్‌ను ఆదుకునే బాధ్యతను భుజాలకెత్తుకున్నారు అనుభవజ్ఞులైన జో రూట్(12 నాటౌట్), స్టోక్స్. ఐదో వికెట్‌కు కీలక కీలక భాగస్వామ్యం నెలకొల్పే పనిలో ఉన్నారు. ఇంగ్లండ్ విజయానికి ఇంకా 108 పరుగులు కావాలి. ఈ జోడీని త్వరగా డగౌట్ చేర్చితే.. టీమిండియా విజయావకాశాలు మెరుగుపడే అవకాశముంది.
A double-wicket over! 👍 👍
Shardul Thakur making merry! 👏 👏
2⃣ good catches – one each by the substitute fielder Nitish Kumar Reddy & then, by Rishabh Pant! 👌 👌
England 4 down as Ben Duckett & Harry Brook depart.
Updates ▶️ https://t.co/CuzAEnAMIW #TeamIndia |… pic.twitter.com/2WoYJK3x7q
— BCCI (@BCCI) June 24, 2025