Mother Murder | జీడిమెట్ల, జూన్ 24: తల్లి తన ప్రేమకు అడ్డు వస్తుందని భావించిన కన్న కూతురు ప్రియుడు, అతని సోదరునితో కలిసి కన్న తల్లి ప్రాణాలు తీసింది. ఈ దారుణ ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. బాలానగర్ జోన్ డీసిపి కే సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం..మహబూబాబాద్ జీల్లా ఇనుగుర్తి గ్రామానికి చెందిన షట్ల అంజలి (39) జనగామ జిల్లా పాలకుర్తికి చెందిన తెలంగాణ సాయుధ పోరాట యేధురాలు చాకలి ఐలమ్మకు ముని మనువరాలు. ఈమెకు రెండు పెళ్లిళ్లు కాగా ఇద్దరు భర్తలు చనిపోయారు. ఈమెకు ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు తేజ శ్రీ 10వ తఠగతి చదువుతుంది.
అంజలి తెలంగాణా సాంస్కృతిక విభాగంలో కళాకారిణిగా పని చేస్తూ జీవనం కొనసాగిస్తుంది. ఈ క్రమంలో తేజ శ్రీ ఎనిమిది నెలల క్రితం బంధువైన నల్లగొండ జిల్లా కట్టంగూరుకు చెందిన పగిళ్ల శివ (19)అనే యువకుడితో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై ప్రేమగా మారింది. ఈ నెల 19న శివతో కలిసి సదరు బాలిక కట్టంగూరుకు అతనితో వెళ్లిపోయింది.
తల్లిని అడ్డు తొలగించేందుకు..
ఈ విషయం తెలుసుకున్న తల్లి అంజలి జీడిమెట్ల పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేసిన పోలీసులు సదరు బాలికను మూడురోజుల క్రితం తీసుకువచ్చి తల్లికి అప్పగించారు. పదవ తరగతికే ప్రేమ ఏమిటని తల్లి మందలించింది. దీంతో తల్లిని అడ్డు తొలగించేందుకు ప్రియుడు శివతో కలిసి తల్లి హత్యకు ప్లాన్ వేసింది. సోమవారం సాయంత్రం నల్లగొండ జిల్లా కట్టంగూరు నుండి ప్రియుడు శివ అతని తమ్ముడు యశ్వంత్ గాజులరామారంలోని ఎన్ ఎల్ బి నగర్ లొని సదరు బాలిక ఇంటికి వచ్ఛారు.
పథకం ప్రకారం ఇంట్లో అంజలి పూజ చేస్తుండగా వెనుక నుంచి దాడి చేసి బెడ్ షీట్ కప్పి చున్నీతో గొంతు నులిమి హత్య చేశారు. సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితులు శివ అతని తమ్ముడు యశ్వంత్ సదరు బాలికను సోమవారం అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు.
మృతురాలి శోభ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతురాలిని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ దవాఖానాకు తరలించారు. కన్న తల్లిని అంత్యంత కిరాతకంగా హత్య చేసిన ఈ సంఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నమంగళవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
Garidepalli : ఎన్ఎఫ్బీఎస్ లబ్ధిదారులకు ఆర్థిక సాయం : తాసీల్దార్ కవిత
Weather Report | నాలుగు రోజులు వానలే.. హెచ్చరించిన వాతావరణశాఖ
Ram Mohan Naidu | బ్లాక్‌బాక్స్ భారత్‌లోనే ఉంది : కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు