Headingley Test : హెడింగ్లే టెస్టులో ఐదో రోజు వికెట్ కోసం నిరీక్షిస్తున్న భారత జట్టుకు ప్రసిధ్ కృష్ణ బ్రేకిచ్చాడు. వర్షం ఆగిన తర్వాత ఆట మొదలైన కాసేపటికే క్రాలే(65)ను వెనక్కి పంపాడు. ఔట్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతిని స్లిప్‌లో కేఎల్ రాహుల్ ఒడుపుగా అందుకున్నాడు. దాంతో, 188 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యం ముగిసింది.
టీమిండియాపై నాలుగో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు ఓపెనింగ్ పార్ట్నర్షిప్ ఇదే అత్యధికం. మొత్తంగా ఆ జట్టుకు రెండోది. క్రాలే తర్వాత వచ్చిన ఓలీ పోప్(8) ఫోర్‌తో ఖాతా తెరిచాడు. సెంచరీ హీరో బెన్ డకెట్(111) సైతం ధనాధన్ ఆడే ప్రయత్నం చేస్తున్నాడు. ప్రస్తుతానికి ఇంగ్లండ్ స్కోర్.. 201-1. ఇంకా విజయానికి 171 పరుగులు అవసరం.