ఆత్మకూర్.ఎస్, ఫిబ్రవరి 18 : ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రంలోని పూర్వ విద్యార్థుల సేవా సమితి ఆధ్వర్యంలో ఆత్మకూర్.ఎస్ భవనంలో శంకరా కంటి ఆస్పత్రి హైదరాబాద్ వారి సౌజన్యంతో దాదాపు 120 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. వారిలో సమస్యలున్న 45 మందిని హైదరాబాద్‌కు తీసుకెళ్తున్నారు. ప్రజలకు ఉచితంగా కంటి పరీక్షలు చేసి అద్దాలు ఇవ్వడం గొప్ప కార్యక్రమం అని, ప్రజలకు సేవ చేయడం అభినందనీయమని ట్రస్ట్ గౌరవ అధ్యక్షుడు డాక్టర్ కొప్పుల రంగారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థుల సమితి అధ్యక్షుడు ఎస్కే సైదులు, దామోదర్ రెడ్డి, తంగేళ్ల పెదవీరారెడ్డి, అప్పారావు, నంద్యాల కృష్ణారెడ్డి, పోరెండ్ల సత్యం, పర్వతాలు, కృష్ణమూర్తి పాల్గొన్నారు.

ఆత్మకూర్.ఎస్‌లో కంటి వైద్య శిబిరం