Greater Noida | 15వ ఫ్లోర్ నుంచి పడిపోయిన లిఫ్ట్.. నోయిడాలో మహిళకు తీవ్ర గాయాలు
Greater Noida : నోయిడా, గ్రేటర్ నోయిడా పరిధిలో ఇటీవల లిఫ్ట్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాజాగా పశ్చిమ గ్రేటర్ నోయిడాలోని ఒక భవంతిలో లిఫ్ట్ 15వ ఫ్లోర్ నుంచి ఒక్కసారిగా కిందికి పడిపోయింది.
Greater Noida : నోయిడా, గ్రేటర్ నోయిడా పరిధిలో ఇటీవల లిఫ్ట్ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో ఎత్తైన భవంతులున్నాయి. ప్రతి బిల్డింగులో లిఫ్ట్‌లు మామూలే. అయితే, అవి తరచూ ప్రమాదానికి గురవుతున్నాయి. తాజాగా పశ్చిమ గ్రేటర్ నోయిడాలోని ఒక భవంతిలో లిఫ్ట్ 15వ ఫ్లోర్ నుంచి ఒక్కసారిగా కిందికి పడిపోయింది. 10వ ఫ్లోర్ వరకు వేగంగా వచ్చి ఆగిపోయింది. ఈ సమయంలో లిఫ్ట్‌లో ఉన్న మహిళకు తీవ్ర గాయలయ్యాయి.
లిఫ్ట్‌లో ఆమె బ్యాలెన్స్ తప్పి కిందపడటం, అక్కడి వాల్స్‌కు వేగంగా తగలడంతో తీవ్రంగా గాయపడింది. ఈ ఘటన సూపర్ టెక్ ఎకో విలేజ్-1 పరిధిలోని జీ5 టవర్‌లో జరిగింది. ఘటన తర్వాత లిఫ్ట్ డోర్లు తెరుచుకోకపోవడంతో వాటిని నిర్వాహకులే తెరవాల్సి వచ్చింది. అనంతరం అందులోని మహిళను స్తానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో ఆమె కాళ్లకు తీవ్ర గాయాలైనట్లు, మూడు చోట్ల విరిగినట్లు డాక్టర్లు తెలిపారు. బాధిత మహిళ టవర్ ఎఫ్7లో ఉంటారు. అయితే, జీ5లో ఉన్న సన్నిహితుల్ని కలవడానికి వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది. అయితే, లిఫ్ట్ పూర్తిగా కిందికి పడిపోకుండా 10వ ఫ్లోరులో ఆగడం వల్ల ఆమెకు మరింత ప్రమాదం తప్పిందని అక్కడి వారు అంటున్నారు. అయితే, తమ ప్రాంతంలో ఇలా వరుసగా లిఫ్ట్ ప్రమాదాలు జరగడంపై నోయడా వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఈ ఘటనలతో తాము భయభ్రాంతులకు గురికావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ దగ్గరి నుంచి నిర్వహణ చార్జీలు వసూలు చేస్తున్నప్పటికీ.. సరైన ప్రమాణాలు పాటించడం లేదని మండిపడుతున్నారు. ఇక్కడి అన్ని లిఫ్ట్‌లపై ప్రభుత్వం టెక్నికల్ ఆడిట్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. లిఫ్ట్ నిర్వహణకు సంబంధించి లిఫ్ట్ యాక్ట్ లా ఉన్న సంగతి తెలిసిందే.
Read Today's Latest Crime News in Telugu and Telugu News
- Tags
- Audit
- greater noida
- lift
- Woman
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

