Headingley Test : హెడింగ్లే టెస్టు తొలి సెషన్లోనే మ్యాచ్ గమనాన్ని మార్చేసిన ఇంగ్లండ్ ఓపెనర్లు జట్టును విజయం దిశగా నడిపిస్తున్నారు. లంచ్ తర్వాత జోరు పెంచిన జాక్ క్రాలే(59 నాటౌట్) అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా బజ్ బాల్ గేమ్ ఆడుతున్న బెన్ డకెట్ (105 నాటౌట్) సెంచరీతో చెలరేగాడు. తొలి వికెట్‌కు 181 రన్స్ జోడించిన ఈ ద్వయం దూకుడుకు వరుణుడు అడ్డుపడ్డాడు. డకెట్ సెంచరీ తర్వాత.. వానజల్లులు మొదలయ్యాయి. దాంతో, ఇరుజట్ల ఆటగాళ్లు డ్రెస్సింగ్ రూమ్‌కు పరుగులు తీశారు. అప్పటికి ఆతిథ్య జట్టు వికెట్ కోల్పోకుండా 181 పరుగులు చేసింది. ఇంకా విజయానికి 190 పరుగుల దూరంలో ఉంది ఇంగ్లండ్.
హెడింగ్లే టెస్టులో ఐదో రోజు ఇంగ్లండ్ ఓపెనర్లు క్రీజులో పాతుకుపోవడంతో భారత బౌలర్లు వికెట్ కోసం చెమటోడ్చుతున్నారు. తొలి సెషన్లో ఓపెనర్లు బౌండరీలతో విరుచుకుపడ్డారు. దాంతో, భోజన విరామానికి ఇంగ్లండ్ వికెట్ కోల్పోకుండా 117 రన్స్ చేసింది. రెండో సెషన్లోనూ బజ్ బాల్ ఆటతో టీమిండియా బౌలర్లను ఉతికేసిన ఓపెనర్ బెన్ డకెట్(105 నాటౌట్) శతకంతో మెరవగా.. జాక్ క్రాలే(59 నాటౌట్) అర్ధ శతకంతో సహకారం అందించాడు.
It’s not going India’s way… pic.twitter.com/qOamqqDuIY
— ESPNcricinfo (@ESPNcricinfo) June 24, 2025
అయితే.. 97 పరుగుల వద్ద సిరాజ్ బౌలింగ్‌లో యశస్వీ క్యాచ్ వదిలేయండంతో బతికిపోయిన డకెట్.. జడేజా ఓవర్లో బౌండరీతో వందకు చేరువయ్యాడు. మాజీ అలెస్టర్ కుక్ తర్వాత నాలుగో ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదిన రెండో క్రికెటర్‌గా రికార్డు నెలకొల్పాడీ హిట్టర్.