Galaxy Unpacked | దక్షిణ కొరియా టెక్ దిగ్గజం శామ్సంగ్ తన గెలాక్సీ అన్ప్యాక్డ్ 2025 ఈవెంట్ తేదీని ఎట్టకేలకు ప్రకటించింది. ఈ ఈవెంట్లో కంపెనీ కొత్త ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్స్‌ను పరిచయం చేయనున్నది. శామ్సంగ్ గెలాక్సీ జెడ్ ఫోల్డ్-7 (Samsung Galaxy Z Fold 7), గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 7 (Galaxy Z Flip 7)ని లాంచ్ చేసే అవకాశాలున్నాయి. దాంతో పాటు గెలాక్సీ వాచ్-8 (Galaxy Watch 8) సిరీస్, ఇటీవల విడుదల చేసిన గెలాక్సీ బర్డ్స్ కోర్ (Galaxy Buds Core) పరిచయం చేసే అవకాశం ఉంది. జులై 9న యూఎస్ఏలోని న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌లో జరుగుతుందని శామ్సంగ్ తన న్యూస్‌రూమ్ పోస్ట్‌లో తెలిపింది. ఈ కార్యక్రమం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7.30 గంటలకు జరుగనున్నది.
ఈ కార్యక్రమాన్ని శామ్సంగ్, యూట్యూబ్ ఛానెల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నది. ఈ కార్యక్రమంలో కొత్త ఏఐ ఆధారిత ఇంటర్ఫేస్లతో నెక్ట్స్ జనరేషన్ గెలాక్సీ డివైజెస్ పరిచయం చేయనున్నట్లు శామ్సంగ్ పేర్కొంది. ఈ డివైజెస్ బ్రేక్‌త్రూ హార్డ్‌వేర్, గెలాక్సీ ఏఐ ఫీచర్స్, శామ్సంగ్ అద్భుతమైన క్రాఫ్ట్మ్యాన్షిప్తో వస్తాయని కంపెనీ తెలిపింది. పలు నివేదికల ప్రకారం.. శామ్సంగ్ ఈ కార్యక్రమంలో కొత్త జనరేషన్ ఫోల్డబుల్ డివైజెస్‌ను లాంచ్ చేయనున్నది. గెలాక్సీ జడ్ ఫోల్డ్ 7 ఇప్పటి వరకు అత్యంత సన్నని, తేలికైన, అత్యంత అధునాతనమైన ఫోల్డబుల్ ఫోన్‌గా పేర్కొంటున్నారు. నివేదికల ప్రకారం, Samsung ఈ కార్యక్రమంలో దాని ఫోల్డబుల్ పరికరాల కొత్త తరంను విడుదల చేయనుంది.
Galaxy Z Fold 7 ఇప్పటివరకు అత్యంత సన్నని, తేలికైన మరియు అత్యంత అధునాతనమైన ఫోల్డబుల్ ఫోన్‌గా వర్ణించబడుతోంది. Galaxy Z Flip 7 కొత్త ఎక్సినోస్ (Exynos) 2500 ప్రాసెసర్‌తో వచ్చే అవకాశం ఉంది. అలాగే, గెలాక్సీ జెడ్ ఫ్లిప్ ఎఫ్ఈ (ఫ్యాన్ ఎడిషన్)ని తీసుకువచ్చే అవకాశం ఉన్నది. ఈ సారి శామ్సంగ్ తన స్మార్ట్‌వాచ్ లైనప్‌ను కూడా విస్తరించే అవకాశం ఉంది. ఈ సారి గెలాక్సీ వాచ్ (Galaxy Watch) 8, వాచ్ 8 క్లాసిక్ (Watch 8 Classic), వాచ్ అల్ట్రా (Watch Ultra) 2025 మోడల్లను విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. ఈ ఈవెంట్లో లాంచ్ చేయనున్న గెలాక్సీ బర్డ్స్ కోర్‌ను కంపెనీ టీజ్ చేసింది. ఈ ఈవెంట్లో శామ్సంగ్, గూగుల్ భాగస్వామ్యంలో అభివృద్ధి చేయబడుతున్న ప్రాజెక్ట్ మూహన్ ఎక్స్ఆర్ (Moohan XR) హెడ్‌సెట్‌పై అప్డేట్పై ప్రకటన చేసే అవకాశం ఉంది. అలాగే, చాలాకాలంగా వార్తల్లో ఉన్న శామ్సంగ్ తొలి ట్రై ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్‌ను సైతం ప్లాట్‌ఫామ్ నుంచే ఆవిష్కరించే అవకాశాలున్నాయి.