Shan Masood : టీ20 వరల్డ్ కప్లో దారుణంగా విఫమైన పాకిస్థాన్ (Pakistan) జట్టుపై విమర్శలు ఆగడం లేదు. పాక్ చెత్త ప్రదర్శనకు డ్రెస్సింగ్ రూమ్లో మూడు గ్రూపులు ఉండడమే కారణమని ఆ దేశ మాజీలు సైతం అంటున్నారు. ఇక బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ మొదలవుతుందనగా పాక్ క్రికెట్ జట్టులో మ్యాచ్ ఫిక్సర్లు (Match Fixers) ఉన్నారనే ఆరోపణలు కలకలం రేపాయి.
సోమవారం మీడియా సమావేశంలో టెస్టు సారథి షాన్ మసూద్ (Shan Masood)ను జర్నలిస్ట్లు ఇదే విషయమై ప్రశ్నించగా అతడు అదంతా అబద్దమంటూ కొట్టిపారేశాడు. మీరు మ్యాచ్ ఫిక్సింగ్ అనే పదాన్ని వాడినట్టు నేను ఆటగాళ్ల ఉద్దేశాన్ని శంకించలేను. ప్రస్తుతం పాక్ క్రికెట్లో ఆ పదానికి చోటే లేదు. ఆటగాళ్ల అంకితభావాన్ని ఎవరూ కూడా ప్రశ్నించలేరు. మీరు అడిగిన దానితో నేను ఏకీభవించను. మరోవిషయం ఏంటంటే.. వరల్డ్ కప్ అనేది గతం. ఆ ఓటమిని మరిచిపోయి ముందుకు సాగాలని అనుకుంటున్నాం.
Pakistan Test squad begins the preparations 🏏
Fielding drills ahead of the #PAKvBAN series 📹 pic.twitter.com/BwNmQylq5e
— Pakistan Cricket (@TheRealPCB) August 11, 2024
జట్టులోని ప్రతి ఒక్కరు పాక్ విజయానికి కృషి చేస్తారని నమ్ముతున్నా. అయితే.. ఆటలో గెలుపు ఓటములు భాగమే. కానీ, పరాజయం చెందినప్పుడు మేము ఎంతో బాధపడుతాం అని మసూద్ వెల్లడించాడు. సొంతగడ్డపై చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy 2025)కి ముందు పాక్ పలు మ్యాచ్లు ఆడనుంది. తొలుత మసూద్ బృందం బంగ్లాదేశ్తో రెండు టెస్టుల సిరీస్లో తలపడనుంది.