హైదరాబాద్‌లోని వరలక్ష్మీ టిఫిన్స్ డ్రగ్స్‌కేసులో నిందితుడిగా ఉన్న పెడ్లర్ మస్తాన్ సాయిని పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో ఏసీ సెబ్ పోలీసులు గుంటూరులో మస్తాన్ సాయిని అదుపులోకి తీసుకున్నారు. అతని ఫోన్లో పలువురు అమ్మాయిలకు సంబంధించిన ప్రైవేటు వీడియోలు ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్‌లోని వరలక్ష్మీ టిఫిన్స్ డ్రగ్స్‌కేసులో నిందితుడిగా ఉన్న పెడ్లర్ మస్తాన్ సా సినీ నటుడు రాజ్ తరుణ్, లావణ్య కేసులో మస్తాన్ పేరు తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే.
జూన్ 3వ తేదీన విజయవాడ రైల్వే స్టేషన్లో డ్రగ్స్ సరఫరా చేస్తుండగా సెబ్ పోలీసులు దాడులు చేశారు. గోపిచంద్, షేక్ ఖాజా, క్రాంతి కిరణ్, షరీఫ్ అనే నలుగుర్ని అరెస్టు చేశారు. అయితే మస్తాన్ సాయి మాత్రం పోలీసుల కళ్లుగప్పి పారిపోయాడు. ఈ క్రమంలో నిందితులు ఇచ్చి సమాచారం మేరకు మస్తాన్ సాయిపై నిఘా పెట్టి ఓ దర్గాలో తలదాచుకుంటుండగా సెబ్ పోలీసులు అరెస్టు చేశారు. విజయవాడలో అతన్ని విచారిస్తున్నారు.