Duvvada Srinivas | వైసీసీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రోజురోజుకీ ముదురుతూనే ఉంది. గత ఐదు రోజులుగా టెక్కలిలోని దువ్వాడ ఇంటి ముందు ఆయన భార్య వాణి ఆందోళన చేస్తూనే ఉంది. ఈ క్రమంలో దువ్వాడ శ్రీను స్పందిస్తూ.. తాను బతికున్నంత కాలం వాణికి, పిల్లలకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రానివ్వనని తెలిపారు. వాణి డిమాండ్ ఏంటో స్పష్టంగా చెబితే ఐదు నిమిషాల్లో పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. కానీ తాను ఉంటున్న ఒక్క ఇంటిని మాత్రం ఇవ్వనని.. ఇంకా ఏది కావాలని అడిగినా రాసిస్తానని స్పష్టం చేశారు. దువ్వాడ ఆఫర్‌పై స్పందించిన వాణి.. కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇప్పటివరకు దువ్వాడ శ్రీనివాస్ తనకు ఎలాంటి ఆస్తులు ఇవ్వలేదని వాణి తెలిపారు. ఇప్పుడు దువ్వాడ ఉంటున్న ఇల్లు కూడా తన డబ్బుతోనే కట్టారని పేర్కొన్నారు. తన సోదరి దగ్గర అప్పు చేసి ఆ డబ్బును దువ్వాడకు ఇచ్చానని చెప్పారు. దువ్వాడకు అసలు ఎలాంటి ఆస్తులు లేవని చెప్పారు. తనకు ఉన్న భూమిని హామీగా పెట్టి ఇక్కడ ఇల్లు కట్టామని తెలిపారు. తన డబ్బుతో కట్టిన ఇంటిని దువ్వాడ వ్యభిచార గృహంగా మార్చేశారని మండిపడ్డారు. తన ఇంటిని అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా మార్చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫ్రెండ్షిప్ హౌస్ అని ఎక్కడైనా ఉంటుందా అని ప్రశ్నించారు. అడల్ట్ రిలేషన్ అంటే అర్థమేంటని నిలదీశారు. దువ్వాడ ఓ ఊబిలో చిక్కుకున్నారని అన్నారు.
మాధురికి తమకు ఎలాంటి సంబంధం లేదని దువ్వాడ వాణి తెలిపారు. మాధురి వచ్చి తమ ఇంట్లో ఉంటుందని ఆమె ఆరోపించారు. మా ఇంట్లోకి వచ్చి మా ఆయనతో మాధురి ఉండటమేంటని ప్రశ్నించారు. తనకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదలనని స్పష్టం చేశారు ఎంత టైమ్ పట్టినా సరే వెయిట్ చేస్తానని అన్నారు. తను తన ఇంట్లోకి వెళ్లడమే దీనికి ఎండ్ కార్డ్ అని పేర్కొన్నారు. పిల్లలపై ఇప్పుడొచ్చి ప్రేమ చూపిస్తున్నారని దువ్వాడపై మండిపడ్డారు. పిల్లలపై దాడి చేసినప్పుడు ఆ ప్రేమ ఎక్కడికి పోయిందని మండిపడ్డారు. తనకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదలనని స్పష్టం చేశారు.
బతికి ఉన్నంత వరకు వాణి, పిల్లలకు ఆర్థిక ఇబ్బందులు రానివ్వనని దువ్వాడ శ్రీనివాస్ తెలిపారు. కుటుంబ వ్యవహారం కాబట్టి పార్టీ అధిష్ఠానం జోక్యం చేసుకోదని తెలిపారు. ఈ పరిణామాలతో తన రాజకీయ జీవితానికి నష్టమేనని అన్నారు. మాధురి, పిల్లలను, నా రాజకీయాలను వాణి నాశనం చేసిందని ఆరోపించారు. మాధురిని, నన్ను విమర్శించినా డోన్ట్ కేర్ అని.. తన పిల్లల్ని ట్రోల్స్ చేస్తే మాత్రం ఊరుకునేది లేదని మండిపడ్డారు. వాళ్లకు ఇంకొన్ని ఆస్తులు ఇవ్వడానికి కూడా సిద్దమేనని స్పష్టం చేశారు. ఈ కుటుంబ గొడవల్లోకి రాజకీయాలు వచ్చాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అచ్చెన్నాయుడు ఆదేశాలతో పోలీసులు వాణికి మద్దతుగా వ్యవహరిస్తున్నారని అననారు. వాణి డిమాండ్ ఏంటో స్పష్టంగా చెబితే ఐదు నిమిషాల్లో పరిష్కరిస్తటానని అన్నారు. తాను ఉంటున్న ఆ ఇంటిని మాత్రం ఇవ్వలేనని స్పష్టం చేశారు. ఇంకా ఏం కావాలో చెబితే వాళ్లకు రాసిస్తానని చెప్పారు.