Intra Squad Match : ఇంగ్లండ్ పర్యటనకు ముందు సన్నాహక పోరులో భారత ప్రధాన పేసర్ బుమ్రా (Bumr5ah) దారుణంగా విఫలమయ్యాడు. ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అయితే.. టాపార్డర్ బ్యాటర్లు మాత్రం దంచేశారు. కెప్టెన్ శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ అర్ధ శతకాలతో ఫామ్ చాటుకున్నారు. ఇండియా ఏ కు ఆడుతున్న సర్ఫరాజ్ ఖాన్ (Sarfaraz Khan) విధ్వంసక శతకంతో మెరిశాడు.
ఇంగ్లండ్ పర్యటనకు ఎంపిక చేయలేదన్న కసితో కాబోలు మెరుపు సెంచరీ బాదాడు. 76 బంతుల్లో 15 ఫోర్లు, 2 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడీ చిచ్చరపిడుగు. దాంతో ఇండియా ఏ రెండో రోజు ఆట ముగిసే సరికి 2 వికెట్ల నష్టానికి 299 పరుగులు చేసింది. అయితే.. ప్రధాన జట్టు కంటే 160 పరుగుల వెనకబడే ఉంది.
బెకెన్హమ్లోని కౌంటీ క్రికెట్ మైదానంలో భారత జట్లు ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్ ఆడుతున్నాయి. ఇంగ్లండ్ లయన్స్‌తో రెండు అనధికారిక టెస్టులు ఆడిన భారత ఏ జట్టుతో శుభ్‌మన్ గిల్ నేతృత్వంలోని సీనియర్ జట్టు తలపడిన ఈ పోరులో.. సర్ఫరాజ్ ఖాన్ సెంచరీతో తన తడాఖా చూపించాడు. 101 పరుగులతో జట్టును పటిష్ట స్థితిలో నిలిపాడు. ఇంగ్లండ్ పిచ్‌లపై ఆడలేదు అనే సందేహాన్ని పటాపంచలు చేసిన సర్ఫరాజ్ సెలెక్టర్లకు సవాల్ విసిరాడు. నిరుడు స్వదేశంలో ఇంగ్లండ్ మీదే అరంగేట్రం చేసిన ఈ రంజీ హీరో.. బెంగళూరులో న్యూజిలాండ్‌పై 150 పరుగులతో చెలరేగిన విషయం తెలిసిందే.
Sarfaraz Khan made a statement as he struck 101 off 76 balls before retiring out in the ongoing intra-squad fixture in Beckenham 💯#ENGvIND #TeamIndia #SarfarazKhan pic.twitter.com/prew8NevE6
— Circle of Cricket (@circleofcricket) June 15, 2025
ఇంట్రా స్క్వాడ్ మ్యాచ్‌లో ప్రధాన పేసర్లు బుమ్రాకు మాత్రం ఒక్క వికెట్ దక్కలేదు. సిరాజ్, ప్రసిధ్ కృష్ణలు తలా రెండు వికెట్లు తీసినా.. భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అభిమాన్యు ఈశ్వరన్(39)ను నితీశ్ కుమార్ పెవిలియన్‌కు పంపాడు.