SA vs IND 1st T20 : ఉప్పల్ స్టేడియంలో మెరుపు సెంచరీ బాదిన సంజూ శాంసన్(51) దక్షిణాఫ్రికా గడ్డపై కూడా దంచేస్తున్నాడు. డర్బన్‌లో జరుగుతున్న తొలి టీ20 పవర్ ప్లేలో సఫారీ స్పిన్నర్లను ఊచకోత కోస్తూ.. శాంసన్ అర్ధ శతకం సాధించాడు. పీటర్ బౌలింగ్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదిన సంజూ తన స్టయిల్లో 27 బంతుల్లోనే యాభైకి చేరువయ్యాడు.
టాస్ ఓడిన భారత్‌కు ఓపెనర్లు శుభారంభమిచ్చారు. అభిషేక్ శర్మ(7), సంజూ శాంసన్(51)లు రెండో ఓవర్ నుంచి దంచారు. తొలి వికెట్‌కు 24 పరుగులు జోడించిన ఈ జోడీని గెరాల్డ్ కొయెట్జీ విడదీశాడు. అభిషేక్ ఔటయ్యాక వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (17) సైతం భారీ షాట్లతో అలరించాడు. దాంతో, టీమిండియా స్కోర్ 8 ఓవర్లకు 75కి చేరింది. ఈ ఇద్దరి జోరు చూస్తుంటే 10 ఓవర్లకే స్కోర్ 100 దాటేలా ఉంది.