తిరుమల : సనాతన ధర్మాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లడానికి సంకల్పంతో ముందుకు వెళతామని టీటీడీ చైర్మన్ (TTD Chairman) బీఆర్ నాయుడు (BR Naidu) వెల్లడించారు. తిరుమలలోని (Tirumala) ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం, ఎస్వీ గోశాలను శుక్రవారం సందర్శించారు.
ఈ సందర్భంగా విద్యార్థులతో చైర్మన్ మాట్లాడుతూ విద్యార్థులు తమ కోర్సులలో నైపుణ్యం సాధించి, సనాతన ధర్మాన్ని (Sanata Dharma) ప్రబోధించాలని సూచించారు. సనాతన ధర్మాన్ని మరింత ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లాలన్నదే తమ సంకల్పమని పేర్కొన్నారు.
ధర్మగిరి ప్రధానార్చకులు తిరుమలలో వైదిక సంస్థ ఆవిర్భావం, ప్రాభవం గురించి వివరించారు. ప్రత్యేక అధికారి ధర్మగిరి విజయలక్ష్మి, ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ మధుసూదన ప్రసాద్, ఎస్వీ గోసాల డైరెక్టర్ డాక్టర్ హరనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం పెద్ద జీయర్ మఠాన్ని సందర్శించి పెద్ద జీయర్ స్వామి ఆశీస్సులను తీసుకున్నారు. అఖిలాండంలో బేడి ఆంజనేయ స్వామికి పూజలు చేశారు.