Pushpa 2 Trailer | మరో 27 రోజుల్లో పుష్ప గాడి రూల్ ప్రపంచవ్యాప్తంగా మొదలుకానుంది. ఎప్పుడెప్పుడా అని అటు బన్నీ అభిమానులతో పాటు మూవీ లవర్స్ ఎదురుచూస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఈ సినిమా నుంచి వరుస అప్డేట్లను ఇస్తున్నారు మేకర్స్.
ఇప్పటికే దీపావళి పండగ సందర్భంగా రష్మిక, అల్లు అర్జున్ రొమాంటిక్ పోస్టర్‌ను విడుదల చేసిన చిత్రబృందం తాజాగా ట్రైలర్ అప్డేట్ను పంచుకుంది. పుష్ప 2 ట్రైలర్ లాక్ అయినట్లు త్వరలోనే ట్రైలర్ రిలీజ్ డేట్‌కి సంబంధించి అప్డేట్ ఇవ్వనున్నట్లు మైత్రీ మేకర్స్ ఎక్స్ వేదికగా ప్రకటించింది. ఇక ఈ ట్రైలర్‌తో పాటు ఈ నెలలో సినిమా ప్రమోషన్ ఈవెంట్లు, సాంగ్స్ లాంటివి ఉండబోతున్నట్లు తెలిపింది. దీంతో పుష్ప 2 విడుదల అయ్యేవరకు నవంబర్ మొత్తం అప్డేట్స్తో ఫ్యాన్స్‌ను ఖుషి చేయబోతున్నట్లు తెలుస్తుంది. అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.
The wait ends!
The Rule takes over 💥💥𝐓𝐇𝐄 𝐓𝐑𝐀𝐈𝐋𝐄𝐑 𝐎𝐅 𝐓𝐇𝐄 𝐁𝐈𝐆𝐆𝐄𝐒𝐓 𝐈𝐍𝐃𝐈𝐀𝐍 𝐅𝐈𝐋𝐌 𝐈𝐒 𝐋𝐎𝐂𝐊𝐄𝐃 🔒❤️🔥#Pushpa2Trailer Announcement is on the way🔥#Pushpa2TheRule GRAND RELEASE WORLDWIDE ON 5th DECEMBER, 2024.#Pushpa2TheRuleOnDec5th
— Mythri Movie Makers (@MythriOfficial) November 8, 2024