Salima Imtiaz : పాకిస్థాన్‌కు చెందిన మాజీ మహిళా క్రికెటర్ సలీమా ఇంతియాజ్(Salima Imtiaz) చరిత్ర సృష్టించింది. ఐసీసీ అంపైర్ల ప్యానెల్ (ICC Umpires Panel)కు నామినేట్ అయింది. దాంతో, ఈ ఘనత సాధించిన తొలి పాకిస్థాన్ మహిళా క్రికెటర్‌గా సలీమా రికార్డు నెలకొల్పింది. ఇకపై ఆమె అంతర్జాతీయ వేదికలపై మహిళల క్రికెట్ మ్యాచ్‌లో అంపైర్‌గా వ్యవహరించనుంది. తనకు ఈ గొప్ప అవకాశం దక్కడం పట్ల సలీమ సంతోషం వ్యక్తం చేసింది. ఈ సందర్బంగా పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB) సలీమాను అభినందిస్తూ ఎక్స్ వేదికగా ఓ వీడియో పోస్ట్ చేసింది.
‘అంతర్జాతీయ మ్యాచుల్లో పాకిస్థాన్ ప్రతినిధిగా ఉండాలనే నా కల నెరవేరింది. ఇది నా ఒక్కదాని విజయం మాత్రమే కాదు అంపైర్ అవ్వాలనుకుంటున్న పాకిస్థాన్‌లోని ప్రతి మహిళా క్రికెటర్ విజయం. నేను సాధించిన ఈ ఘనత దేశంలోని అమ్మాయిల్లో స్ఫూర్తిని నింపి, వాళ్లు ఆటల్లో రాణించే విధంగా ఉపయోగపడుతుందని నా నమ్మకం’ అని సలీమా చెప్పింది.
Replug ⏪
As we celebrate Saleema Imtiaz becoming Pakistan’s first woman umpire on the ICC International Development Panel, let’s recall the journey of the mother-daughter duo 🗣️@kainatimtiaz16 pic.twitter.com/TfutvumFMH
— Pakistan Cricket (@TheRealPCB) September 15, 2024
అంతేకాదు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు మహిళా అథ్లెట్లను, అధికారులను ప్రోత్సహిస్తుందని ఆమె వెల్లడించింది. తనకు ఇంతకుముందు ఆసియా క్రికెట్ కౌన్సిల్ నుంచి కూడా అంపైర్‌గా అవకాశాలు వచ్చాయని సలీమా చెప్పింది. మాజీ క్రికెటర్ అయిన సలీమా 2008లో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు అంపైర్స్ ప్యానెల్లో చేరింది. ఆమెను స్ఫూర్తిగా తీసుకన్న కూతురు కైనత్ (Kaintath) క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకుంది. 2010లో అరంగేట్రం చేసిన కైనత్ ఇప్పటివరకూ 40 మ్యాచులు ఆడింది. వాటిలో 19 వన్డేలు, 21 టీ20లు ఉన్నాయి.