Neeraj Chopra | విరిగిన చేయితోనే బరిలోకి.. అందుకే ఆ సెంటీమీటర్ తగ్గింది..!
Neeraj Chopra : బ్రస్సెల్స్ వేదికగా జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్లో నీరజ్ చోప్రా (Neeraj Chopra) రెండో స్థానంతో నిరాశపరిచాడు. ఒక్క సెంటీ మీటర్ తేడాతో టైటిల్ కోల్పోయాడు. అయితే.. ఫైనల్లో నీరజ్ విరిగిన చేయితోనే పోటీ పడ్డాడు. నొప్పిని భరిస్తూనే ఈటెన్ విసిరాడు.
Neeraj Chopra : బ్రస్సెల్స్ వేదికగా జరిగిన డైమండ్ లీగ్ ఫైనల్లో నీరజ్ చోప్రా (Neeraj Chopra) రెండో స్థానంతో నిరాశపరిచాడు. ఒక్క సెంటీ మీటర్ తేడాతో టైటిల్ కోల్పోయాడు. అయితే.. ఫైనల్లో నీరజ్ విరిగిన చేయితోనే పోటీ పడ్డాడు. నొప్పిని భరిస్తూనే ఈటెన్ విసిరాడు. కొద్దిలో టైటిల్ కోల్పోయిన భారత బడిసె వీరుడు వచ్చే ఏడాది మరింత బలంతో వస్తానని చెప్పాడు.
అయితే.. తన చేయి విరిగిందనే విషయాన్ని పోటీల అనంతరం నీరజ్ ఎక్స్ వేదికగా వెల్లడించాడు. విరిగిన చేయి ఎక్స్ రే ఫొటోను అతడు పోస్ట్ చేశాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో నీరజ్ మూడో ప్రయత్నంలో బడిసెను 87.86 మీటర్ల దూరం విసిరాడు. జులియన్ వెబర్ 87.97 మీటర్ల దూరంలో అగ్రస్థానంలో నిలిచి టైటిల్ ఎగరేసుకుపోయాడు.
As the 2024 season ends, I look back on everything I’ve learned through the year – about improvement, setbacks, mentality and more.
On Monday, I injured myself in practice and x-rays showed that I had fractured the fourth metacarpal in my left hand. It was another painful… pic.twitter.com/H8nRkUkaNM
— Neeraj Chopra (@Neeraj_chopra1) September 15, 2024
‘2024 సీజన్ ముగిసింది. ఈ ఏడాదంతా నేను నేర్చుకున్న విషయాలు, మెరుగైన తీరు, ఎదుర్కొన్న కష్టాలు, మానసికంగా సిద్ధమైన తీరు వీటన్నిటినీ బేరీజు వేసుకుంటా. ఇక సోమవారం.. ప్రాక్టీస్ సమయంలో నాచేతికి గాయమైంది. ఎక్స్ రే తీయగా నా ఎడమ చేతి నాలుగో వేలి దగ్గర ఎముక విరిగింది. అది నాకు ఎంతో సవాల్ విసిరింది. అయినా సరే నా బృందం సహాయంతో బ్రస్సెల్స్‌లో నేను పోటీ పడగలిగాను’ అని నీరజ్ తెలిపాడు. ఎక్స్ ఖాతాలో నీరజ్ పోస్ట్ చూసిన అభిమానులంతా అతడి పట్టుదలకు జై కొడుతూ.. త్వరగా కోలుకోవాలంటూ కామెంట్లు పెడుతున్నారు.

పారిస్ ఒలింపిక్స్ ముందు గజ్జల్లోని కండరాల సమస్య(స్పోర్ట్స్ హెర్నియాలో ఒక రకం)తో చోప్రా బాధ పడ్డాడు. దాంతో, అతడి
సన్నద్ధత కూడా సరిగ్గా జరగలేదు. అయినా సరే.. చోప్రా విశ్వ క్రీడల్ల అదరగొట్టాడు. ఫైనల్లో 89.45 మీటర్ల దూరం బడిసెను విసిరి సిల్వర్ మెడల్‌తో చరిత్ర సృష్టించాడు.
దేశానికి పతకం అందించాలనే తన లక్ష్యం పూర్తి కావడంతో కొన్ని రోజుల బ్రేక్ తీసుకుంటానని నీరజ్ చెప్పాడు. సర్జరీ చేసుకోవాలని అనుకున్న అతడు గాయం తీవ్రత ఎక్కువ లేనందున మళ్లీ ఈటెను అందుకున్నాడు. సర్జరీ వాయిదా వేసుకొని.. లసానే డైమండ్ లీగ్‌లో పోటీ పడిన నీరజ్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
ఇవి కూడా చదవండి
- Cellulitis | కరీంనగర్లో చర్మ వ్యాధి కలకలం.. విజృంభిస్తున్న సెల్యూలైటిస్..!
- Arvind Kejriwal | కేజ్రీవాల్ రాజీనామా నిర్ణయం ప్రచార ఎత్తుగడే..! : బీజేపీ, కాంగ్రెస్ ఫైర్
- Chhattisgarh | దారుణం.. మంత్రాల నెపంతో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి హత్య..!
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NTR | ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’పై క్లారిటీ.. నిర్మాతలతో త్రివిక్రమ్ క్రేజీ పిక్, రూమర్స్‌కు చెక్ పడ్టట్లే..!
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

