Allu Arjun | పుష్ప ది రైజ్‌తో వరల్డ్‌వైడ్‌గా సూపర్ క్రేజ్ సంపాదించుకున్నాడు టాలీవుడ్ స్టార్ యాక్టర్ అల్లు అర్జున్ (Allu Arjun). పుష్పరాజ్‌గా అలరించి ఐకాన్ స్టార్‌గా మారిపోయాడు. అల్లు అర్జున్ ఇప్పుడు మరోసారి పుష్ప ది రూల్‌తో అలరించేందుకు రెడీ అవుతున్నాడని తెలిసిందే. సుకుమార్ డైరెక్షన్లో రాబోతున్న సీక్వెల్ షూటింగ్ దశలో ఉంది. కాగా అల్లు అర్జున్‌కు ఓ అభిమాని (పేరు తెలియదు) షాకింగ్ గిఫ్ట్ పంపించాడు.
అదేంటో తెలుసా.. సీ.కే ఒబెరాన్ రాసిన Burned Beneath the Fire of Desire పుస్తకం. ఈ విషయాన్ని ఇన్స్టాగ్రామ్ స్టోరీ ద్వారా అందరితో షేర్ చేసుకున్నాడు. ‘ఈ కానుకను నాకు పంపించిన వ్యక్తి నిజాయితీ, నిష్కకపటమైన తీరు నన్ను కదిలించింది. ఓ పుస్తక ప్రేమికుడిగా ఈ జెంటిల్మెన్ మిస్టర్ సీ.కే ఒబెరాన్‌కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నానని’ క్యాప్షన్ ఇచ్చాడు బన్నీ. ఇప్పుడీ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది.
ఈ మూవీని 2024 డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదల చేసిన రిలీజ్ అప్డేట్ పోస్టర్లో బన్నీ పుష్పరాజ్‌గా కత్తి పట్టుకుని ఊరమాస్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై సూపర్ హైప్ క్రియేట్ చేస్తున్నాడు.
ఫస్ట్ పార్టుకు అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆల్బమ్ అందించిన రాక్‌స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ మరోసారి సీక్వెల్‌గా కూడా పనిచేస్తు్ండటంతో భారీ అంచనాలు నెలకొన్నాయి. సీక్వెల్ పార్ట్‌లో ఫహద్ ఫాసిల్, జగదీష్ ప్రతాప్ బండారి, జగపతిబాబు, ప్రకాశ్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేశ్, ధనంజయ, షణ్ముఖ్, అజయ్, శ్రీతేజ్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Mathu Vadalara 3 | త్రిబుల్ ఎంటర్టైన్ మెంట్.. మత్తు వదలరా 3 కూడా వచ్చేస్తుంది
SIIMA 2024 | సైమా 2024లో తెలుగు సినిమాల హవా.. అవార్డు విన్నర్ల జాబితా ఇదే
Chiranjeevi | End Titlesను కూడా వదలకుండా చూశా.. మత్తు వదలరా 2పై చిరంజీవి
Journey Re release | శర్వానంద్, అంజలి జర్నీ రీరిలీజ్‌కు రెడీ.. డేట్ ఎప్పుడంటే..?