Rawalpindi Test : సొంతగడ్డపై పాకిస్థాన్ జట్టు అద్భుతం చేసింది. బంగ్లాదేశ్‌పై రెండు టెస్టుల్లో ఓటమని దిగమింగి.. బజ్‌బాల్ ఆటతో చెలరేగిపోతున్న ఇంగ్లండ్ (England)కు బ్రేకులు వేస్తూ చిరస్మరణీయ విజయం సాధించింది. తొలి టెస్టులో ఇన్నింగ్స్ 147 పరుగుల తేడాతో ఓడినప్పటికీ అనూహ్యంగా పుంజుకొని సిరీస్ కైవసం చేసుకుంది. రావల్పిండి వేదికగా జరిగిన మూడో టెస్టులో స్పిన్ ద్వయం సాదిజ్ ఖాన్(6/128, 4/69) తన తడాఖా చూపించడంతో పాక్ 9 వికెట్ల తేడాతో విజయ ఢంకా మోగించింది. దాంతో, నిరుడు పాక్ పర్యటనలో సిరీస్ కొల్లగొట్టిన ఇంగ్లండ్ ఈసారి ఉత్త చేతులతోనే ఇంటికి వెళ్లనుంది.
రావల్పిండి టెస్టులో తొలి రోజు నుంచే పట్టుబిగించిన పాకిస్థాన్ భారీ విజయం నమోదు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లను ముప్పతిప్పలు పెడుతూ 2-1తో సిరీస్ కైవసం చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో సాదిజ్ ఖాన్(6128), నొమన్ అలీ(388)లు తిప్పేయడంతో ఇంగ్లండ్ 267 పరుగులకే ఆలౌటయ్యింది.
For only the second time in their Test history, Pakistan have come from behind to claim a series win 🏆
2-1 vs Zimbabwe in 1995
𝟮-𝟭 𝘃𝘀 𝗘𝗻𝗴𝗹𝗮𝗻𝗱 𝗶𝗻 𝟮𝟬𝟮𝟰 pic.twitter.com/DgrqElMovI— ESPNcricinfo (@ESPNcricinfo) October 26, 2024
అనంతంర ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్.. సాద్ షకీల్ (134) సూపర్ సెంచరీతో కోలుకుంది. బంతితోనే కాదు బ్యాటుతోనూ చెలరేగగలమబంటూ నొమన్ అలీ(45), సాజిద్ ఖాన్(48)లు కీలక పరుగులు జోడించారు. దాంతో, పాక్ 344 రన్స్ చేయగలిగింది. సిరీస్ సమం చేయాలంటే పోరాడక తప్పని పరిస్థితుల్లో ఇంగ్లండ్ బ్యాటర్లు మళ్లీ విఫలమయ్యారు.
Sajid Khan was a sensation!
Player of the Series in an unforgettable triumph for Pakistan 🏅 pic.twitter.com/MAeAIDYBP4
— ESPNcricinfo (@ESPNcricinfo) October 26, 2024
నొమన్ అలీ(6/42), సాజిద్ ఖాన్(4/69)ల విజృంభణతో అందరూ పెవిలియన్‌కు క్యూ కట్టగా జో రూట్(23), హ్యారీ బ్రూక్(26)లు మాత్రమే పర్వాలేదనిపించారు. దాంతో, 112 పరుగులకే ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. స్వల్ప లక్ష్యాన్ని పాక్ ఓపెనర్ సయీం ఆయూబ్(8) వికెట్ కోల్పోయి ఛేదించింది. మరో ఓపెనర్ అబ్దుల్లా షఫీక్(5 నాటౌట్), కెప్టెన్ షాన్ మసూద్(23 నాటౌట్)లు జట్టుకు మరపురాని విజయాన్ని కట్టబెట్టారు.