Ash Gourd Juice Benefits | బూడిద గుమ్మడికాయల గురించి అందరికీ తెలిసిందే. చాలా మంది ఇవి కేవలం దిష్టి తీసేందుకే పనికొస్తాయని అనుకుంటారు. వాస్తవానికి బూడిద గుమ్మడికాయలను మనం తినవచ్చు. కొందరు వీటితో పలు రకాల వంటకాలను కూడా చేస్తుంటారు. బూడిద గుమ్మడికాయలను తినడం వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వీటి జ్యూస్‌ను కూడా తీసి తాగవచ్చు. చైనా, ఇండియాలలో ఈ కాయలను ఎక్కువగా పండిస్తారు. ఈ క్రమంలోనే రోజూ బూడిద గుమ్మడికాయ జ్యూస్‌ను తాగడం వల్ల అనేక అద్భుతమైన ప్రయోజనాలను పొందవచ్చు. అనేక వ్యాధులను తగ్గించడంలో ఈ జ్యూస్ అద్భుతంగా పనిచేస్తుంది. బూడిద గుమ్మడికాయ జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల అనేక పోషకాలను పొందవచ్చు.
బూడిద గుమ్మడికాయల్లో క్యాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, జింక్, విటమిన్ సి, బి కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి. అలాగే అల్సర్లను నయం చేసే అల్సర్ ఇన్హిబిషన్ లక్షణాలు కూడా ఈ కాయల్లో ఉంటాయి. అదేవిధంగా యాంటీ యాంజియోజెనిక్, రెనాల్ ప్రొటెక్షన్, యాంటీ డయేరియల్, యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, అనాల్జెసిక్ గుణాలు, యాంటీ డయాబెటిక్, యాంటీ డిప్రెసెంట్ లక్షణాలు కూడా బూడిద గుమ్మడికాయల్లో ఉంటాయి. అందువల్ల మనల్ని రోగాల బారి నుంచి రక్షించడంలో ఈ కాయలు అద్భుతంగా పనిచేస్తాయని వైద్యులు చెబుతున్నారు.
బూడిద గుమ్మడికాయ జ్యూస్‌ను రోజూ ఉదయం ఒక కప్పు మోతాదులో తాగడం వల్ల మెదడు పనితీరు మెరుగు పడుతుంది. మెదడు యాక్టివ్‌గా మారుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. శరీరంలోని శక్తి స్థాయిలు పెరుగుతాయి. రోజంతా చురుగ్గా పనిచేస్తారు. బూడిద గుమ్మడికాయకు చలువ చేసే గుణం ఉంటుంది. కనుక దీని జ్యూస్‌ను తాగితే శరీరంలోని వేడి తగ్గిపోతుంది. దీంతో శరీరం చల్లగా మారుతుంది. పైల్స్ సమస్య ఉన్నవారికి ఈ జ్యూస్ ఎంతగానో పనిచేస్తుంది. పైల్స్ దెబ్బకు తగ్గుముఖం పడతాయి. ఈ జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల మలబద్దకం నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. గ్యాస్, కడుపులో మంట, నొప్పి తగ్గుతాయి.
బూడిద గుమ్మడికాయ జ్యూస్‌ను తాగడం వల్ల శరీరానికి చలువ చేస్తుంది కనుక కఫం ఎక్కువగా తయారయ్యేవారు, దగ్గు, జలుబు సమస్యలు ఉన్నవారు ఈ జ్యూస్‌ను తాగకపోవడమే మంచిది. బూడిద గుమ్మడికాయ జ్యూస్‌ను రకరకాలుగా తయారు చేసుకుని తాగవచ్చు. ఇందులో నిమ్మరసం, ఉప్పు, పుదీనా రసం, కొత్తిమీర రసం కలిపి తాగవచ్చు. లేదా ఈ జ్యూస్క్షల పుచ్చకాయ రసం, నీళ్లు, పెరుగు, తేనె కలిపి జ్యూస్‌లా చేసి తాగవచ్చు.
బూడిద గుమ్మడికాయ జ్యూస్‌లో పెరుగు, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి కలిపి తీసుకోవచ్చు. లేదా ఈ జ్యూస్‌లో నిమ్మరసం, మిరియాల పొడి, ఉప్పు కలిపి తాగవచ్చు. ఇలా పలు రకాలుగా బూడిద గుమ్మడికాయ జ్యూస్‌ను తీసుకోవచ్చు. దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండవచ్చు.