ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో (Maharashtra election) పోటీ కోసం కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా ప్రకటించింది. మరో 23 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది. కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ (సీఈసీ) సమావేశం తర్వాత రెండో జాబితాను శనివారం విడుదల చేసింది. కాంగ్రెస్, శివసేన (యూబీటీ) మధ్య వివాదంగా మారిన నాగ్పూర్ సౌత్ సీటు కాంగ్రెస్కు దక్కింది. ఈ నియోజకవర్గం నుంచి గిరీష్ కృష్ణరావు పాండవ్ బరిలోకి దిగనున్నారు.
కాగా, తొలి జాబితాలో 48 మంది అభ్యర్థులను కాంగ్రెస్ ప్రకటించింది. వీరిలో 25 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు. తాజాగా 23 మందితో రెండో జాబితా రిలీజ్ చేసింది. దీంతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు 71 మంది అభ్యర్థులను ప్రకటించింది.
మరోవైపు మహారాష్ట్రలో ప్రతిపక్ష కూటమి అయిన మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)లో ఎలాంటి విభేదాలు లేవని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. శనివారం సాయంత్రంలోగా భాగస్వామ్య పక్షాల మధ్య తుది సీట్ల పంపకం ఖరారవుతుందని పేర్కొంది. కాగా, మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు ఒకే విడతలో నవంబర్ 20న పోలింగ్ జరుగనున్నది.
Congress releases another list of 23 candidates for the upcoming #MaharashtraAssemblyElections2024 pic.twitter.com/Cs0cthvcfD
— ANI (@ANI) October 26, 2024