Joe Root : సుదీర్ఘ ఫార్మాట్లో పరుగుల వీరుడిగా పేరొందని జో రూట్ (Joe Root) మరో శతకంతో రెచ్చిపోయాడు. లార్డ్స్ మైదానంలో భారత్‌పై సూపర్ సెంచరీతో జట్టును ఆదుకున్న రూట్ కెరియర్లో 37వ సారి మూడంకెల స్కోర్ అందుకున్నాడు. తనకు అచ్చొచ్చిన వేదికపై మరెవరికీ సాధ్యం కాని రికార్డును పట్టేశాడు రూట్. ఇక టీమిండియాపై అత్యధిక పర్యాయాలు వంద కొట్టిన రెండో ఆటగాడిగా చరిత్ర సృష్టించాడీ ఇంగ్లండ్ మాజీ సారథి.
లార్డ్స్‌లో కీలక ఇన్నింగ్స్‌తో శతకం బాది జట్టును పటిష్ట స్థితిలో నిలిపిన రూట్ ఒకే మైదానంలో అత్యధిక సెంచరీల వీరుల క్లబ్లో చేరాడు. అతడికి ఈ మైదానంలో ఇది ఎనిమిదో సెంచరీ కాగా.. శ్రీలంక వెటరన్ మహేల జయవర్దనే కొలంబో మైదానంలో ఏకంగా 11 సెంచరీలతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.
Eight Test hundreds for Joe Root at Lord’s – only Jayawardene, Bradman and Kallis have scored more tons at a single venue 🏟️ pic.twitter.com/ye5XWSLpNm
— ESPNcricinfo (@ESPNcricinfo) July 11, 2025
ఈ జాబితాలో లెజెండ్ డాన్ బ్రాడ్‌మన్ మెల్బోర్న్ గ్రౌండ్లో 9 సార్లు శతకం బాదాడు. దక్షిణాఫ్రికా మాజీ ఆల్‌రౌండర్ జాక్వెస్ కలిస్ కేప్ టౌన్లో రికార్డు స్థాయిలో 9 పర్యాయాలు మూడంకెల స్కోర్ అందుకున్నాడు. కుమార సంగక్కర (శ్రీలంక) తమ దేశంలోని కొలంబో స్టేడియంలో 8 సెంచరీలతో రికార్డు నెలకొల్పాడు. ఇండియా అంటే చాలు పూనకం వచ్చినట్టు ఆడే రూట్ 11 సెంచరీలతో ఆస్ట్రేలియా వెటరన్ బ్యాటర్ స్టీవ్ స్మిత్(Steve Smith) సరసన చేరాడు. వెస్టిండీస్ దిగ్గజం వివ్ రిచర్డ్స్, గ్యార్‌ఫీల్డ్ సోబర్స్ తలా 8 శతకాలు బాదారు.
Most Test centuries against India:
𝗝𝗼𝗲 𝗥𝗼𝗼𝘁 – 𝟭𝟭
Steve Smith – 11
Ricky Ponting – 8
Viv Richards – 8
Garfield Sobers – 8 pic.twitter.com/GW5Xh5q1uk— ESPNcricinfo (@ESPNcricinfo) July 11, 2025