Financial assistance | చిగురుమామిడి, జూలై 11: చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి గ్రామానికి చెందిన కూన సాయిబాబా అనారోగ్యానికి గురై హైదరాబాదులో చికిత్స పొందుతున్నాడు. కాగా మిత్రుడికి ఆపరేషన్ కు రూ.20 లక్షల ఖర్చయ్యాయి. విషయం తెలుసుకున్న తోటి 1997-98 పదో తరగతి బ్యాచ్‌కు చెందిన పూర్వ విద్యార్థులు రూ.1.08 లక్షలు అతడి భార్య కూన రజితకి ఆస్పత్రిలో అందజేశారు.
అందజేసిన వారిలో అతడిమిత్రులు బూడిద సదాశివ, అందే చిన్నస్వామి, మేకల కుమార్, పులి శ్రీనివాస్, విజయ్, సాయిలు, శ్రీనివాస్, బాబు తదితరులు ఉన్నారు.