Hockey | హుజూరాబాద్ టౌన్, జూలై 11 : జార్ఖండ్ లో జరిగిన సబ్ జూనియర్ జాతీయ హాకీ పోటీలలో జంపాల శివసంతోషిణి పాల్గొని ట్రోఫీ సాంధించారు. ఈ సందర్భంగా పట్టణంలోని కాకతీయ కళాశాలలో అధ్యాపకులు ఆమెను శుక్రవారం శాలువాతో సన్మానించి, అభినందించారు.
ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ భవిష్యత్ లో మరింతగా క్రీడల్లో రాణించాలని ఆకాంక్షించారు. కళాశాల ప్రిన్సిపల్ వేణుమాధవ్ తో పాటు అధ్యాపకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.