Gurukul Entrance Test | జోగులాంబ గద్వాల జిల్లా ధరూర్ మండలం ర్యాలంపాడు గురుకుల పాఠశాలలో ఆదివారం జరగాల్సిన గురుకుల (ఎంట్రెన్స్ ఎగ్జామ్)ప్రవేశ పరీక్ష నిర్వహణలో తీవ్ర గందరగోళం నెలకొంది.
షెడ్యూల్ ప్రకారం ప్రవేశ పరీక్ష ఉదయం 11 గంటలకే ప్రారంభం కావాల్సి ఉండగా.. సమమం దాటిపోయి గంటలు గడుస్తున్నా ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రవేశ పరీక్ష కోసం దూర ప్రాంతాల నుంచి తమ పిల్లలను తీసుకొచ్చిన తల్లిదండ్రులు, అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ స్కూల్ గేట్ ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు.
పరీక్ష నిర్వహణా లోపంపై విద్యార్థులు, తల్లిదండ్రులు ఎండలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా నిర్వాహకులు సరైన సమాధానం రాకపోవడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. పోలీసులు పరిస్థితులు పరిస్థితులను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు.
ర్యాలంపాడు గురుకుల పరీక్షా కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత
గురుకుల ప్రవేశ పరీక్ష నిర్వహణలో తీవ్ర గందరగోళం
పరీక్ష ఆలస్యంపై భగ్గుమన్న విద్యార్థుల తల్లిదండ్రులు
గంటలు గడిచినా ప్రారంభం కాని ఎంట్రెన్స్ ఎగ్జామ్
పాఠశాల ముందు బైఠాయించి విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన
జోగులాంబ గద్వాల… pic.twitter.com/KcrRwAV4fB
— Telugu Scribe (@TeluguScribe) February 22, 2026
Medak | మెదక్ జిల్లాలో దారుణం..భార్యను గొంతు కోసి హతమార్చి, నగలతో పరారైన భర్త
Modugapoolu | మోదుగు పువ్వులు విరబూస్తూ.. బాటసారులకు కనువిందు చేస్తూ
Rtc bus | లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్‌కు గాయాలు