నల్లగొండ, జులై 11 : పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అసోసియేట్ మాజీ అధ్యక్షుడు బొస్క సైదులు రావు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ( తపస్) లో చేరారు. శుక్రవారం జిల్లా పరిషత్ పాఠశాల నర్సింగ్భట్లలో చేపట్టిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో సైదులు తపస్లో చేరారు. ఈ సందర్భంగా తపస్ నల్లగొండ జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిని భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తపస్ నిరంతరం కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా తపస్ ప్రచార కార్యదర్శి విజయ్ కుమార్, యాదగిరి, రామకృష్ణ పాల్గొన్నారు.