IND vs ENG : మాంచెస్టర్ టెస్టులో విజయంపై కన్నేసిన భారత జట్టుకు పరాభవం తప్పేలా లేదు. బ్యాటింగ్‌లో శుభారంభం లభించినా సద్వినియోగం చేసుకోలేక నాలుగొందల లేపే కుప్పకూలిన టీమిండియా ఇక డ్రా కోసం పోరాడాల్సిన పరిస్థితి తెచ్చుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో బజ బాల్ ఆటతో ఇంగ్లండ్ బ్యాటర్లు కదం తొక్కగా.. భారీ ఆధిక్యంలో నిలిచింది. జో రూట్(150) సూపర్ సెంచరీతో డీలా పడిన గిల్ సేనకు బెన్ స్టోక్స్ (141) రికార్డు శతకంతో కొండంత స్కోర్ అందించాడు. టెయిలెండర్ బ్రైడన్ కార్సే(47) సైతం ధనాధన్ ఆడగా 669 రన్స్ కొట్టిన ఆతిథ్య జట్టు… ఏకంగా 311 పరుగుల ఆధిక్యం సాధించి మ్యాచ్‌పై పట్టుబిగించింది. కాసేపట్లో రెండో ఇన్నింగ్స్ ఆరంభించనున్న భారత్‌ను బ్యాటర్లు ఆదుకుంటారా? లేదా? చూడాలి.
సిరీస్‌లో కీలకమైన నాలుగో టెస్టులో బౌలర్ల వైఫల్యం భారత జట్టు కొంపముంచింది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా () దారుణ ప్రదర్శనతో ప్రత్యర్థి బ్యాటర్లు వీరకొట్టుడు కొట్టారు. దాంతో, ఇంగ్లండ్ మాంచెస్టర్ టెస్టులో డ్రైవింగ్ సీట్లో ఉంది. టాపార్డర్ నుంచి మిడిలార్డర్ వరకూ అందరూ రాణించడంతో భారత బౌలర్లకు దిక్కుతోచలేదు. ఓపెనర్లు బెన్ డకెట్(94), జాక్ క్రాలే(84) శుభారంభమివ్వగా.. మూడో రోజు జో రూట్(150), ఓలీ పోప్(71)లు విధ్వంసం కొనసాగించారు. సుందర్ వరుస ఓవర్లలో పోప్, హ్యారీ బ్రూక్(3)ను ఔట్ చేసి ఉపశమనం ఇచ్చాడు. కానీ, రూట్ సాయంతో బెన్ స్టోక్స్(141) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. ఇద్దరూ భారత బౌలర్లను పరీక్షిస్తూ పరుగుల పండుగ చేసుకున్నారు.
The first England captain to take a five-for and score a century in the same Test.
Ben Stokes is back to his best ✨ pic.twitter.com/DPKlVGbUfl
— ESPNcricinfo (@ESPNcricinfo) July 26, 2025
స్వీప్ షాట్లతో అలరించిన అలరించిన రూట్ 38వ సెంచరీ సాధించగా.. స్టోక్స్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. మధ్యలో కండరాలు పట్టేయడంతో బ్రేక్ తీసుకున్న అతడు.. ఏడో వికెట్ పడ్డాక క్రీజులోకి వచ్చి బ్యాటింగ్ కొనసాగించాడు. మూడో రోజు అజేయంగా నిలిచి జట్టు కొండంత స్కోర్‌లో భాగమయ్యాడు. నాలుగో రోజు సైతం అదే దూకుడుతో టీమిండియా బౌలర్లను బెంబేలెత్తిచిన స్టోక్స్ సెంచరీతో గర్జించాడు. సుదీర్ఘ ఫార్మాట్లో 14వ సెంచరీతో దిగ్గజాల సరసన చేరిన అతడు ఆ తర్వాత సిక్సర్లతో చెలరేగాడు. జడేజా, సుందర్ ఓవర్లో బౌండరీలతో దడ పుట్టించిన స్టోక్స్‌ను ఎట్టకేలకు జడేజా వెనక్కి పంపాడు. పెద్ద షాట్లతో విరుచుకుపడుతున్న స్టోక్స్‌ను జడ్డూ ఔట్ చేసి.. ఊరటనిచ్చాడు. అయినా బ్రైడన్ కార్సే(47) బ్యాట్ ఝులిపించగా ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 669 పరుగులు చేసింది. ఈ మైదానంలో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం.