Rohit Sharma | డబ్ల్యూపీఎల్ ఫైనల్.. హర్మన్‌ప్రీత్ సేనకు ఆల్ ది బెస్ట్ చెప్పిన హిట్‌మ్యాన్
wpl 2023 : మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)తొలి సీజన్ ఫైనల్ పోరుకు మరికొద్ది సేపట్లో తెరలేవనుంది. ఈ సందర్భంగా ఫైనల్‌కు చేరిన ముంబై ఇండియన్స్(Mumbai Indians) టీమ్‌కు ఆ జట్టు ఐపీఎల్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఒకే కుటుంబానికి చెందిన తామంతా హర్మన్‌ప్రీత్(Harmanpreet kaur) సేనకు మద్దతు ఇస్తామని అతను తెలిపాడు.
Rohit Sharma : మహిళల ప్రీమియర్ లీగ్ (WPL)తొలి సీజన్ ఫైనల్ పోరుకు మరికొద్ది సేపట్లో తెరలేవనుంది. ఈ సందర్భంగా ఫైనల్‌కు చేరిన ముంబై ఇండియన్స్(Mumbai Indians) టీమ్‌కు ఆ జట్టు ఐపీఎల్ కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఒకే కుటుంబానికి చెందిన తామంతా హర్మన్‌ప్రీత్(Harmanpreet kaur) సేనకు మద్దతు ఇస్తామని అతను తెలిపాడు. రోహిత్ విషెస్ చెప్తున్నవీడియోను ముంబై ఫ్రాంఛైజీ సోషల్‌మీడియాలో పెట్టింది. ‘మా మహిళల జట్టకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. మేమందరం మీకు మద్దతుగా ఉంటాం’ అని వీడియోలో హిట్‌మ్యాన్ మాట్లాడాడు. ముంబైలోని బ్రబౌర్న్ స్టేడియంలో జరిగే ఫైనల్ ఫైట్‌లో ముంబై, పటిష్టమైన ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఢీ కొట్టనుంది. మ్యాచ్ సాయంత్రం 7ః30 గంటలకు ప్రారంభం కానుంది.
టోర్నీ ఆసాంతం అదరగొట్టిన ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), ముంబై ఇండియన్స్(Mumbai Indians) ఫైనల్లో తలపడనున్నాయి. టైటిల్ ఫైట్‌లో ఇరుజట్లు గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. ఢిల్లీ కెప్టెన్ మేగ్ లానింగ్ (Meg Lanning), ముంబై సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) నిన్న ప్రీ- ఫైనల్స్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పాల్గొన్నారు. ఇరువురు తమ జట్టు బలాబలాల గురించి, మ్యాచ్ సన్నద్థత గురించి పలు విషయాలు మాట్లాడారు.
ఎవరు గెలిచినా రికార్డే..
ముంబై ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ఇప్పటివరకు రెండు సార్లు తలపడ్డాయి. చెరొక మ్యాచ్‌లో విజయం సాధించాయి. ఆల్రౌండర్లలో ముంబై బలంగా కనిపిస్తోంది. సమిష్టిగా ఆడుతున్న ఢిల్లీ కూడా గట్టి పోటీ ఇవ్వనుంది. దాంతో.. కీలకమైన టైటిల్ పోరులో పైచేయి ఎవరిది? అనేది మరికొన్ని గంటల్లో తేలనుంది. ఏ టీమ్ గెలిచినా తొలి సీజన్ ఛాంపియన్‌గా రికార్డు సృష్టించనుంది.
ఇవి కూడా చదవండి
Women’s World Boxing Championships | ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించిన నీతు, స్వీటీ
WPL 2023 Final | నేడే డబ్ల్యూపీఎల్ ఫైనల్.. ఢిల్లీ, ముంబైలో ఛాంపియన్‌గా నిలిచేది ఎవరో?
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

